రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సొంతగానే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. ఈ క్రమంలో మరో కీలక ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న రామాయపట్నం ఓడరేవుకు కేంద్రం సహకరించకపోయినా.. స్వశక్తితోనే ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించి జనవరి 9న శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇప్పటికే, పోలవరం సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను ఆమోదించకుండా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కొర్రీలు వేస్తుంటే.. రాష్ట్రం సొంత నిధులతోనే లక్ష్యాన్ని అధిగమించేందుకు సన్నద్ధమైంది.
కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరి ప్రదర్శించింది. దీంతో ఇటీవల ఈ స్టీల్ ప్లాం ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రామాయపట్నం పోర్టు లాభనష్టాలపై మెసర్స్ రైట్స్ సంస్థ అధ్యయనం చేసి లాభదాయకమేనని నివేదిక ఇచ్చింది. దీనిని కేంద్రానికి పంపింది. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి పలు దఫాలు రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రామాయపట్నం పోర్టు డీపీఆర్ తయారీని ప్రభుత్వం కాకినాడ పోర్టు డైరెక్టరేట్‌కు అప్పగించింది. అదేసమయంలో పోర్టుకు అవసరమైన వనరులు, నిధులు సమకూర్చే బాధ్యత ను ఏపీ మారిటైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఎంఐడీసీఎల్)కు అప్పగించారు. ఏపీఎంఐడీసీఎల్ నిర్వహణ కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
మరో రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు తాజాగా రామాయపట్నం ఓడరేవును పూర్తి చేసే బాధ్యతను కూడా చంద్రబాబు తానే తీసుకున్నారు. తద్వారా, మేము సహాయం చెయ్యకపోతే, మీరు ఎదగరు, మేము చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి అనే, ఢిల్లీ అహంకారానికి ఎదురు నిలబడి, మీరు సహాయం చెయ్యకపోయినా, ఎదిగే సత్తా, దమ్ము మా ఆంధ్రులకు ఉంది, అనే విధంగా, మరోసారి ఢిల్లీ వాళ్లకి, ఆంధ్రుడు అంటే ఎంతో చెప్పటానికి చంద్రబాబు రెడీ అయ్యారు. సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవా రంగాల విస్తృతికి తాను నాలుగున్నర ఏళ్లుగా రాత్రి పగలు అహర్నిశలు పాటుపడుతూ, రాష్ట్రాన్ని ఆంధ్రుల కష్టంతో ముందుకు తీసుకువెళ్తున్నారు.