ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం పై, ఇప్పుడిప్పుడే కేంద్రంలో ఉండే మంత్రులకు కూడా నిజా నిజాలు తెలిసిపోతున్నాయి. ఇటీవల మూడు రాజధానుల చట్టాన్ని, శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరించుకున్న ప్రభుత్వం, ఆ తరువాత మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం అని పదే పదే చెప్తూ వస్తుంది. అదే విధంగా, నిన్న జరిగిన మీడియా సమవేశంలో కూడా కొడాలి నాని కూడా, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం అని చెప్పారు. ఈ నేపధ్యంలోనే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయంసం అయ్యాయి. ప్రధానంగా మూడు రాజధానులు అంటే, ఏ రాజధానికి వెళ్ళాలి, ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గున్న ఆయన, మూడు చోట్ల రాజధాని పెడితే ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన ప్రశ్నించారు. ఒక్క రాజధాని కూడా ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేక పోయారని, ఇక మూడు రాజధానులకు నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. నిధులు లేకనే అభివృద్ధి ఆగిపోయింది అనే విషయం అందరికీ తెలిసిందే కదా అంటూ, ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించింది వ్యాఖ్యానించారు.

radha 12022022 2

దీంతో పాటు రాష్ట్ర విభజన సమయంలో, ఏపి రాజధానికి, దాని అభివృద్ధి గురించి ఆ రోజే మాట్లాడాల్సింది అని, అప్పుడు మాట్లాడకుండా ఉండటమే, ఇప్పుడు రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం అని ఆయన న్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అని చెప్తున్నారు అని, ఇంత వరకు ఉన్న అమరావతి రాజధానికే నిధులు లేక అభివృద్ధి నిలిపివేస్తే, మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అనే అంశం మంచిదే కాని, ఇలా కాదని, అసలు ముందు నిధులు కావాలి కదా అని అన్నారు. గతంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వారు. అయితే ఈ సారి మాత్రం, జగన్ ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాసారు. గతంలో ఎప్పుడూ కూడా, ఇలా మాట్లాడలేక పోవటంతో, వైసీపీ శ్రేణులు కూడా షాక్ తిన్నాయి. అలాగే చంద్రబాబు-అమరావతి అంటూ ఆయన అనేక సార్లు ప్రస్తావించటం కూడా వైసీపీకి షాక్ ఇచ్చే అంశం. మొత్తానికి నెమ్మదిగా అందరికీ నిజాలు తెలుస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read