గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన విమర్శించారు. భయానక వాతావరణం సృష్టించేందుకే ఐటీ దాడులు చేశారని, రాజకీయంగా అభాసుపాలు చేయాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. పైనుంచి ఒత్తిడి ఉందని ఐటీ అధికారులే చెప్పారని సీఎం రమేష్‌ వెల్లడించారు.

kadapa 14102018 2

తప్పుడు వారెంట్‌తో వచ్చి తన ఇంట్లో సోదాలు చేశారని, రిత్విక్‌ అగ్రిలో తన భార్య డైరెక్టర్‌ కాదని.. షేర్‌ హోల్డర్‌ కాదని ఆయన తెలిపారు. తన కంపెనీ నుంచి వేలకోట్లు తరలిపోయాయని తప్పుడు వార్తలు రాశారని ఆయన చెప్పుకొచ్చారు. తమ కంపెనీ టర్నోవరే రూ.వెయ్యి కోట్లు లేదని, తన ఇంట్లో రూ.3.53లక్షలు స్వాధీనం చేసుకున్నారని సీఎం రమేష్‌ తెలిపారు. రూ.3.53లక్షల్లో దాదాపు రూ.2లక్షలు దేవుని ముడుపులే ఉన్నాయని చెప్పారు. తన ఇంట్లో ఉన్నవారి బ్యాంకు అకౌంట్లు, పాస్‌బుక్స్ తీసుకున్నారని, అలహాబాద్‌ బ్యాంక్‌లో తమకు అసలు అకౌంటే లేదని సీఎం రమేష్‌ తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కీలక పత్రాలు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

kadapa 14102018 3

పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు రిపారని సీఎం రమేష్‌ అభిప్రాయపడ్డారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులు తనతో అన్నారని సీఎం రమేష్‌ చెప్పడం గమనార్హం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ నేత సీఎం రమేశ్ గట్టిగా చెప్పారు. ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని, కడప బిడ్డగా మీసం మెలేసి చెప్తున్నా అని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారాన్ని జాతీయస్థాయిలో తెలియజేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read