గత కొద్ది రోజులుగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్ హ్యాండిల్ ఆయన చేతిలో లేదని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి, చెల్లి, ఆలి, అమ్మాయికి తేడా తెలియని మత్తులో ఉండే రాంగోపాల్ వర్మ ట్వీట్లు మాత్రమే సర్కాస్టిక్‌గా, సెటైరికల్ గా చాలా అతి తక్కువ పదాలతో చిన్న వాక్యాలలో ఉండేవి. అవి ఎవరైనా ఎత్తిచూపేవి. బుల్లెట్టులా తగిలేవి. ఇటీవల కాలంలో మానసికంగా, ఆర్థికంగా బాగా కుంగిపోయిన రాంగోపాల్ వర్మ వైసీపీకి అమ్ముడుపోయాడని విమర్శలు వచ్చాయి. ఆర్జీవీని ఎంత పెద్దవాళ్లు కలవాలన్నా ముంబై వెళ్లేవారు. పొలిటీషియన్లను అస్సలు లెక్క చేసేవాడు కాదు. అటువంటి రాంగోపాల్ వర్మ తాడేపల్లి ప్యాలెస్ కి వచ్చి జగన్ రెడ్డి ముందు చేతులు కట్టుకుని నిలుచున్నప్పుడే వర్మని అభిమానించేవాళ్లంతా షాకయ్యారు. అనంతరం తన భాష కాని, తన జోనర్ కాని ట్వీట్లు హ్యాండిల్‌లో ప్రత్యక్షం అవ్వడంతో ఇన్నాళ్లు వర్మని ఆరాధించిన యారోగెంట్, యాటిట్యూడ్ బ్యాచు అంతా ఇది అమ్ముడుపోయిన సరుకు అంటూ డిసైడయ్యారు. టిడిపి-జనసేన అధినేతల భేటీ అయితే కాపుల్ని కించపరిచేలా ట్వీటేశాడు. తనకేమాత్రం సంబంధంలేకపోయినా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడులను వాడు వీడంటూ ట్వీట్ చేశాడు. నాదెండ్ల మనోహర్, చంద్రబాబు కలిసి పవన్ కి వెన్నుపోటు పొడుస్తారంటూ మళ్లీ తన హ్యాండిల్ నుంచి వైసీపీ పెయిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. అయితే ఆర్జీవీ స్టైల్ లాంగ్వేజ్, స్టైల్ కాని ఈ ట్వీట్లు పూర్తిగా వైసీపీ పేటీఎం బ్యాచు వేస్తోందని క్లారిటీ వచ్చేసింది. రాంగోపాల్ వర్మ ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో కానీ తన ట్వీట్టర్ హ్యాండిల్ కూడా వైసీపీకి తాకట్టు పెట్టేశాడని ఆయన ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. వైసీపీ క్యాంప్ మాత్రం కత్తి మహేష్‌లా టిడిపి-జనసేనపై దాడి చేసేందుకు కరెక్టయిన పర్సన్ రాంగోపాల్ వర్మ అని నిర్ణయించుకున్నాకే పేమెంట్ మాట్లాడుకుని రాంగోపాల్ వర్మని, ఆయన ట్విట్టర్ హ్యాండిల్నీ వాడుతున్నారట.
రాంగోపాల్ వర్మ ట్విట్టర్ హ్యాండిల్ రైట్స్ వైసీపీ పేటీఎం బ్యాచ్ దగ్గర ఉన్నాయా ?
Advertisements