వీళ్ళు అధికారంలోకి రాకపోతేనే ఇలా ఉన్నారు.. ఇక పొరపాటున అధికారంలోకి వస్తే, నరమేధం సృస్తిసారు.. ఇంతకీ ఎవరు వారు అంటారా ? ఇంకా ఎవరండీ వైసీపీ పార్టీ బ్యాచ్.. వాళ్ళ పార్టీ నాయకుడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి అంటాడు... ముఖ్యమంత్రి ఉరి వేసి చంపేయాలి అంటాడు... ఐఏఎస్ ఆఫీసర్ లని జైలుకి తీసుకుపోతా అంటాడు.. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని ఇలాగే అన్నాడు జగన్. మా నాయకుడే ఇలా చేస్తే ఎలా అనుకున్నారో ఏమో, జగన్ పార్టీలో నాయకులు కూడా ఇలాగే రేచ్చిపోతూ ఉంటారు. అనేక సందర్భాలో వీళ్ళ అరాచకాలు చూసాం. ప్రజలని ఎలా భయబ్రాంతులకు గురి చేసారో చూస్తున్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే కడపలో జరిగింది. ఏకంగా పోలీసుల పైనే రెచ్చిపోయారు.
తన పార్టీ వారిని అదుపులోకి తీసుకొని కొట్టారంటూ పది మందితో కలిసి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న తన అనుచరుల వద్దకు దూసుకెళ్లారు. సీఐ జీఆర్యాదవ్ అడ్డుచెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిరసన వ్యక్తం చేస్తూ స్టేషన్ బయట బైఠాయించారు. టీటీడీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నియోజకవ ర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో వైసీపీకి చెందిన కొందరు తప్పుడు సమాచారం పెట్టడంతో ఆ పార్టీ నాయకులు శనివారం మైదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వారిలో కొంతమందిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి తెలియడంతో పార్టీ నాయకులు, అనుచరులతో పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లారు. అంతలో సీఐ లేచి ఎమ్మెల్యే వద్దకు చేరుకుని ఏంటిదీ.. ఇంత దౌర్జన్యమా.. నా అనుమతి లేకుండా నిందితుల వద్దకు ఎలా పోయారన్నారు.
దీంతో రఘురామిరెడ్డి, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బయటకు వెళ్లండి అంటూ సీఐ, పోలీసులు వారిని బయటకు పంపారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ‘మమ్మల్నే రావద్దంటావా.. షూట్ చేస్తానంటావా.. ఎంతమందిని షూట్ చేస్తావు రా..’ అంటూ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో వారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఎమ్మెల్యే, తన న్యాయవాది జ్వాలా నరసింహశర్మతో కలిసి సీఐ వద్దకు వెళ్లి చర్చించారు. తిరిగి నాయకులతో కలిసి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీఐ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తన అనుమతి లేకుండానే విచారణలో ఉన్న నిందితుల వద్దకు సుమారు 30, 40 మందితో దౌర్జన్యంగా వెళ్లడం ఏంటన్నారు. ఎమ్మెల్యే అని గౌరవం ఇచ్చానన్నారు. ఎంత చెప్పినా ఆయన పార్టీ కార్యకర్తలు వినక పోవడంతో అందరినీ బయటకు పంపించామన్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియచేశానని ఆయన వివరించారు.