కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పథం పట్టించడంలో సీఎం చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తూనే మరోవైపు అన్నపూర్ణగా పేరు గాంచిన ఏపీలో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కేవలం అభివృద్ధితోనే సరిపెట్టకుండా పేదల సంక్షేమానికీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ఏటా లక్షల కోట్ల రూపాయాలను వెచ్చిస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పేదలకు పౌష్టికాహారం అందజేయడం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పటికే తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ పై నిత్యావసర సరకులు పంపిణీ చేస్తోంది. సర్వమత సమానత పాటిస్తున్న చంద్రబాబు సర్కార్ అయితే, పండగ నాడూ పేదలు మరింత ఆనందంగా ఉండాలనేది ప్రభుత్వ అభిమతం. ఇందుకుగానూ చంద్రన్న కానుకల పేరుతో పేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తోంది.
సర్వమత సమానతను పాటిస్తూ, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు ఈ సరుకులను అందజేస్తోంది. ఇందుకోసం నాలుగేళ్ల నుంచి చంద్రన్న కానుకల పేరుతో ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. చందన్న కానుకల పేరుతో అందజేసే కిట్ లో నెయ్యి 100 గ్రాములు, పామాయిల్ అర లీటరు, కిలో గోధుమ పిండి, అరకిలో కందిపప్పు, అరకిలో శెనగపప్పు, బెల్లం అరకిలో ఉంటున్న విషయం తెలిసిందే. రంజాన్ తోఫా పేరుతో అందజేసే కిట్ లో నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. రూ.17 విలువ చేసే కిట్ లో 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పంచదార, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఉంటున్నాయి. చంద్రన్న కానుకల వల్ల రాష్ట్రంలో ఉన్న కోటి 40 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండగ రోజుల్లోనూ పేద కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జూన్ 1 నుంచి 12 లక్షల మందికి రంజాన్ తోఫా ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ముస్లిము సోదరులకు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా తోఫా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.35.29 కోట్లు వెచ్చించనుంది. దీనివల్ల రాష్ట్రంలో తెలుగు రంగు రేషన్ కార్డులు కలిగిన 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. రూ.17ల విలువ కలిగిన రంజాన్ తోఫా కిట్ లో నాలుగు రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయి. 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా అందజేయనున్నారు. ఈ నాలుగు రకాల వస్తువుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.488. జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న 27.666 రేషన్ డిపోల ద్వారా రంజాన్ తోఫా అందజేయనున్నారు.
కార్డుదారులకే కాకుండా డీలర్లు కూడా సంతోషంగా పండగ జరుపుకునేలా ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో చంద్రన్న కానుకలు, రంజాన్ తోఫా పంపిణీ చేసేటప్పుడు డీలర్లకు రూ.5ల కమీషన్ అందజేసేది. మారుతున్న పరిస్థితులు, ధరల నేపథ్యంలో వారికి అందజేసే కమీషన్ పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అందజేసే కమీషన్ ను వంద శాతం పెంచింది. ప్రతి కార్డుకూ డీలర్లకు రూ.10 అందజేయనుంది. చంద్రన్న సరకుల పంపిణీ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. కానుకల్లో నాణ్యత లోపం లేకుండా ఉండేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసింది. సరుకులు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించినా 1100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కార్డుదారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, సరకుల నాణ్యతాలోపంతో ఎవరూ నష్టపోకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.