ఈ నెల ఆరవ తేదీన వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కంపెనీకి చెందిన రాంకీ సంస్థల పై ఐటి శాఖ అధికారులు, పెద్ద ఎత్తున, దాదాపుగా 20 బృందాలతో కలిసి సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా, ఇలా వీటికి సంబందించిన కార్యకలపాలు చేస్తూ ఉంటారు. అయితే రాంకీ ఐటి సోదాల్లో ఆసక్తికర విషయాలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థలో ఎక్కువ వాటాని, సింగపూర్ కు చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు అమ్మేసారు. తద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, సుమారుగా 1200 కోట్ల రూపాయలని, మొత్తాన్ని వైట్ లోకి మార్చుకునేందుకు రంగురంగుల స్కీంలను వీళ్ళు ప్రవేశ పెట్టారు అంటూ, ఐటి శాఖ ఈ రోజు ఇచ్చిన ప్రెస్ నోట్ లో తెలిపింది. అలాగే క్యాపిటల్ గెయిన్స్ నుంచి టక్స్ మినహాయింపు పొందటం కోసం, అనేక పధకాలు ప్రవేశపెట్టారని, ఈ 1200 కోట్ల రూపాయలు కృత్రిమంగా నష్టం వచ్చినట్టుగా, లెక్కలు చూపించారని, దొంగ లెక్కలు చూపించి పన్ను ఎగ్గొట్టారు అంటూ ఐటి అధికారులు తెలిపారు. ఎక్కవ స్టేక్స్ సింగపూర్ లో ఉన్న ఎన్ఆర్ఐ కు అమ్మారు అంటూ, సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా అధికారులకు తెలిసి, ఈ వచ్చిన ధనాన్ని ఏమి చేసారు అంటూ, ఇంకా లోతుగా ఐటి అధికారులు దర్యాప్తు చేస్తే, ఈ మొత్తం ధనాన్ని కృత్రిమంగా నష్టం వచ్చినట్టు చూపించారని గుర్తించారు.

ramky 09072021 2

కృత్రిమంగా నష్టం ఎలా వచ్చింది అని చెప్పటానికి, అనేక రంగు రంగుల స్కీంలు పెట్టినట్టు గుర్తించారు. ఇక మరో విషయం, రూ.288 కోట్లకు సంబంధించి, పత్రాలను సంస్థ నాశనం చేసిందని, ఐటి అధికారులు గుర్తించారు. మరో 300 కోట్లకు సంబంధించి, బ్లాక్ మనీ కూడా పట్టుకున్నారు. అయితే ఈ బ్లాక్ మనీ పై, పన్ను చెల్లించేందుకు రాంకీ సంస్థ అంగీకరించినట్టు ఐటి శాఖ తెలిపింది. మొత్తానికి పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది అంటూ ఐటి శాఖ ప్రకటించింది. సెబి ఇచ్చిన ఫిర్యాదులు మేరకు, ఐటి శాఖ సోదాలు చేసినట్టు తెలిపింది. దీని పై గత రెండు మూడు రోజులుగా అనేక ఆరోపణలు, అనేక విశ్లేషణలు నడిచాయి. 20 బృందాలు పాల్గునటంతో, అందరికీ ఆసక్తి నెలకొంది. రాంకీ అధినేత అయోధ్య రామి రెడ్డి, వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. ఈయన దేశంలోనే ధనవంతులు ఎంపీల్లో ఒకరుగా ఉన్నారు. అలాగే ఈయన జగన్ కేసుల్లో కూడా ఉన్నారు. జగన్ కేసుల్లో ఏ4గా అయోధ్య రామిరెడ్డి ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read