రాష్ట్రం దివాళా తీస్తుంటే, జగన్ ఆయన అనుచరుల కంపెనీల మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయని టిడిపి నేత పట్టాభి అన్నారు. ఈ రోజు విలేఖరులతో మాట్లాడిన ఆయన, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే, "జగన్మోహన్ రెడ్డి కంపెనీలు, ఆయన అనుచరుల కంపెనీలే ఎందుకు కళకళలాడుతున్నాయోకూడా ఆలోచించాలి. వాటిలో ముందుగా రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని తీసుకుంటే, వైసీపీఎంపీ అయోధ్యరామిరెడ్డిది. రెండేళ్లలోనే ఆ కంపెనీ ఆస్తులు, రామిరెడ్డి ఆదాయం అమాంతం పెరగడంతో, ఐటీ వారి కన్ను కూడా పడింది. దాంతో ఐటీవారు సదరు కంపెనీపై దాడులు కూడా చేశారు. రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ షేర్ వ్యాల్యూ గత సంవత్సర కాలంలో ఎన్నడూలేని విథంగా కళ్లు తిరిగేరీతిలో 442 శాతం పెరిగింది. ఎన్ ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) డేటాలో ఈ సమాచారం ఉంది. అంత తక్కువ సమయంలో షేర్ వ్యాల్యూ అంతలా పెరగడం చాలా అరుదు. రెండు సంవత్సరాల కాలంలో రాంకీ ఆస్తులు అమాంతం పెరగడం వల్లే, షేర్ వ్యాల్యూ కూడా 442శాతం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయిన భారతి సిమెంట్స్ సంగతి కూడా చూద్దాం. భారతి సిమెంట్స్ లో ప్రధాన వాటా దారు వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ. వైక్యాట్ వారు మే6-2021న 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, తొలి త్రైమాసికం (మొదటిమూడునెలలు) కంపెనీ ఆదాయవి వరాలని వేదికను వారి కంపెనీ వెబ్ సైట్లో ఉంచారు. దానిలో ఏమని రాశారంటే, భారతదేశానికి సంబంధించి, తమకున్న ఏకైక కంపెనీ భారతి సిమెంట్స్ అని, కడప, కాల్ బుర్గికు చెందిన రెండు ప్లాంట్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలిత్రైమాసికంలోని టర్నోవర్లో అనూహ్యంగా 42శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. భారతి సిమెంట్స్ కంపెనీ 42శాతం వృద్ధి నమోదు చేయడానికి కారణాన్ని కూడా చెప్పారు. ఇంప్రూవ్ మెంట్ ఇన్ సెల్లింగ్ ప్రైసెస్ (సిమెంట్ ధరలపెరుగుదల) అని చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసి, భారీగా ధరలు పెంచేలా చేశాడుకదా? దానికికారణమే భారతి సిమెంట్స్ టర్నోవర్ తొలిత్రైమాసికంలోనే 42శాతం పెరగడం. ఆ మొత్తం విలువ భారత కరెన్సీలో రూ.800కోట్లు. అదీ లాభమంటే. ఇలా ఉంటే రాష్ట్ర ఖజానా వెలవెలబోకుండాఎలా ఉంటుంది? ఏ1 ఆదాయం, ఆయన కంపెనీల ఆదాయం అలా పెరుగుతుంటే, ఇక ఏ2 విజయసాయి కంపెనీల సంగతేంటో చూద్దాం."

"విజయసాయి అల్లుడి కంపెనీ అయిన అరబిందోకు రాష్ట్రంలో ని పోర్టులన్నింటినీ, ఈ ముఖ్యమంత్రి ఒకదాని తర్వాత ఒకటి ధారాదత్తం చేస్తున్నాడు. కాకినాడ ప్రాంతంలోని రెండు కీలకమైన పోర్టులతోపాటు, రామాయపట్నం పోర్టుని కూడా అరబిందో పరం చేశారు. 75కిలోమీటర్ల పరిధిలో రెండు పోర్టులు ఒకే కంపెనీ అధీనంలో ఉండకూడదనే నిబంధనను కూడా అరబిందోకోసం తుంగలోతొక్కి, కాకినాడ వద్ద ఉన్న రెండుపోర్టులను అరబిందోకు అప్పగించారు. రాష్ట్రంలోని ప్రధానమైన పోర్టులను, విజయసాయి రెడ్డి తన అల్లుడికి కట్న కానుకల కింద సమర్పించాడు. రాంకీ, భారతి సిమెంట్స్, అరబిందోల పరిస్థితి అలా ఉంటే, ఇక హెటిరో డ్రగ్స్ విషయానికి వద్దాం. సీబీఐ, ఈడీ ఈ ముఖ్యమంత్రిపై గతంలో ఫైల్ చేసిన అనేక చార్జ్ షీట్లలో సహముద్దాయిగా ఉన్న పార్థసారథి రెడ్డిదే ఈహెటిరోసంస్థ. విశాఖపట్నం వద్ద ఉన్న రూ.225 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం పార్మా కంపెనీకి ధారాదత్తం చేసిందని పత్రికల్లో వార్తలుకూడా వచ్చాయి. విశాఖపట్నంలోని బేపార్క్ లోని వాటాలతో పాటు, అదే నగరంలోని కీలకమైన ఆస్తులను కూడా హెటిరో పరంచేశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కానీ, ఆయన అనుచరుల కంపెనీలు కానీ ఈ రెండేళ్లలో ఎంతలా లాభాలార్జించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సాక్షి పత్రిక, ఛానెల్ లాభాలకు హద్దేలేదు. నిత్యం ప్రకటనల రూపంలో తన మీడియా సంస్థకు వందలకోట్లు దోచిపెడుతున్నాడు. అందుకే అన్నది జగన్ హావాలా దెబ్బకు రాష్ట్రం దివాలా అని. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్లకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, తనసొంతకంపెనీలను మాత్రం జాగ్రత్తగా లాభాల్లో ముంచితేలుస్తున్నాడు. "

Advertisements

Advertisements

Latest Articles

Most Read