జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్‌లు చేతులు కలపడం వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెనక్కి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యాపాల్ మాలిక్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రాంమాధవ్ మాట్లాడుతూ.. పీడీపీ-నేషనల్ కాన్ఫరెన్స్ చేతులు కలపడం వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు చేతులు కలిపినట్టు తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాంమాధ్ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

rammadhav 22112018 2

రాంమాధవ్ తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రా, ఐబీ, ఎన్ఐఏ తో కానీ లేదా మీ పంజరంలో ఉన్న చిలుక సీబీఐతో కానీ విచారణ జరిపించి... ఆధారాలను ప్రజలు ముందు ఉంచాలని అన్నారు. కపట రాజకీయాలను బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఒమర్ డిమాండ్‌తో దిగివచ్చిన రాంమాధవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన ఆరోపణలు రాజకీయమే తప్ప వ్యక్తిగతం కాదని తేల్చి చెప్పారు. ఎన్సీపీ-పీడీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు తమ కలయిక నిజమైనదే అయితే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని రాంమాధవ్ సవాలు విసిరారు.

 

rammadhav 22112018 3

బుధవారం రాత్రి ఉన్నపళంగా జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసెంబ్లీని రద్దు చేయడం సరైన నిర్ణయమేనంటూ రామ్‌ మాధవ్‌ గవర్నర్‌ను వెనకేసుకొచ్చారు. దాయాది దేశం ఆదేశాల మేరకే పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాయని ఆరోపించారు. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాజాగా వారికి సరిహద్దు అవతలి నుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి. వాళ్ల చర్యల వల్లే గవర్నర్‌ ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు… అని రామ్‌ మాధవ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కొద్ది సేపట్లోనే అబ్దుల్లా ట్విటర్‌ వేదికగా స్పందించారు. రామ్‌ మాధవ్‌ తన ఆరోపణలను నిరుపించుకోవాలనీ, లేకుంటే క్షమాణలు చెప్పడానికి తగిన మనిషిగా మిగిలిపోతారంటూ ధ్వజమెత్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read