ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభాజించే సమయంలో, మన రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ చట్టంలో కూడా పెట్టారు. దాదాపుగా 18 హామీలు కేంద్రం ఇచ్చింది. గత టిడిపి హాయాంలో, పోరాటాలు చేసి చేసి, పాక్షికంగా కొన్ని రాబట్టింది అప్పటి ప్రభుత్వం. చంద్రబాబు ఏమి సాధించ లేడు, నన్ను గెలిపించండి, నేను ఢిల్లీ వెళ్తాను, మోడి మెడలు వంచి హోదాతో పాటుగా, అన్ని విభజన హామీలు తీసుకుని వస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హామీ నమ్మి, ప్రజలు భారీగా ఓట్లు వేసి, ఆయన్ను గెలిపించారు. అయితే జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాతే, మోడీకి పూర్తి మెజారిటీ ఉంది, ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం తప్ప మనం ఏమి చేయలేం అని తేల్చి చెప్పారు. ఇక ఇదే అలుసుగా తీసుకున్న కేంద్రం, ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా అప్పటి నుంచి ఇవ్వలేదు. నిజానికి రాజ్యసభలో వైసీపీ సభ్యులు మద్దతు బీజేపీకి చాలా అవసరం. మీరు మా హామీలు నెరవేర్చితేనే, మేము మీ బిల్లుకి మద్దతు ఇస్తాం అని, కేంద్రం ఒప్పుకోక ఏమి చేస్తుంది ? తాజాగా నిన్న కేంద్రం పార్లమెంట్ లో ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇక రైల్వే జోన్లు ఎవరికీ ఇవ్వం అని చెప్పింది, అయితే ఇప్పటికే వైజాగ్ కి రైల్వే జోన్ ప్రకటించినా, ఆ పేరు మాత్రం ఇప్పటికే ప్రకటించిన లిస్టు లో ఇవ్వలేదు.

ramu 09122021 2

దీంతో ఇక విశాఖకు రైల్వే జోన్ అంశం కూడా అస్సాం అనే చెప్పాలి. అయితే ఈ అంశం పై వైసీపీ నుంచి అంత మంది ఎంపీలు ఉన్నా, ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ అంశం పై పార్లమెంట్ లో ఒత్తిడి పెట్టలేదు. ఈ రోజు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు జీరో హావర్ లో ఈ అంశం లేవనెత్తారు. మా రాష్ట్రానికి రైల్వే జోన్ అనేది చట్టంలో ఉందని అన్నారు. అయితే 2019లో కేంద్రం ప్రకటన చేసినా, దీని పై మూడేళ్ళు అయినా అడుగు పడలేదని అన్నారు. అయితే ఈ మధ్య కేంద్రాన్ని ఒక ప్రశ్న అడిగితే, విశాఖ రైల్వే జోన్ కోసం 40 లక్షలు ఇచ్చాం అన్నారని, ఇది మా రాష్ట్రాన్ని అవమానించటమే అని రామ్మోహన్ అన్నారు. ఆ డబ్బులతో ఒక బిల్డింగ్ కూడా రాదనీ అన్నారు. అయితే నిన్న కేంద్రం మళ్ళీ అసలు విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పకుండా, కొత్తవి కూడా ఏర్పాటు చేయం అని చెప్పిందని, అసలు ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు కాబట్టి, కేంద్రం ఈ అంశంలో తమకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. విశాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కూడా ప్రారంభించాలని, ఈ మొత్తం అంశం పై కేంద్రాన్ని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. ముగ్గురు టిడిపి ఎంపీలే ఇలా గర్జిస్తుంటే, మరి 22 మంది వైసిపీ ఎంపీలు ఏమి చేస్తున్నారో ? పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/wGKthXsat7I

Advertisements

Advertisements

Latest Articles

Most Read