శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ ఎర్రంనాయుడు తనయుడు, రామ్మోహన్‌నాయుడు ఎంపీగా చురగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే... స్వర్గీయ ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీకి, ఢిల్లీలో అన్నీ తానై చూసుకునేవారు... ఢిల్లీలో రాష్ట్రానికి ఏ పనులు కావలి అన్నా, చంద్రబాబు ఆయనకే బాధ్యతను అప్పచేప్పవారు... ఇక స్వర్గీయ ఎర్రంనాయుడు వాక్ చాతుర్యం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు... ఆయన ఆ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వాడు అయిన కన్విన్స్ అవ్వాల్సిందే... అయితే, తండ్రి చనిపోయిన తరువాత, చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకున్నారు... రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ లో ఏంతో చక్కగా మాట్లాడుతూ, అన్ని డిబేట్స్ లో పాల్గుంటూ, అందరి మన్ననలు పొందుతున్నారు... తండ్రిలాగానే, ప్రతి విషయం మీద అవగాహనతో, తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టి పడేస్తూ వస్తున్నారు...
ఈ రోజు రైల్వేజోన్ కోరుతూ చేపట్టిన తెదేపా ఎంపీల ఒక్కరోజు నిరశన దీక్ష ముగింపు సందర్భంగా, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లడారు. రైల్వే జోన్ వల్ల ఉపయోగాలు ఏంటి, విభజన చట్టం, కేంద్రం చేస్తున్న అన్యాయం ఇలా అన్నీ అర్ధం అయ్యేలా ప్రజలకు వివరించారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి లొంగిపోయి పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు చూస్తూనే ఉన్నాం. దాదాపు నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ఉన్నా, రైల్వే జోన్ గురించి కాని, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరు పై కాని, కానీసం స్పందించలేదు. మేధావులతో మీటింగ్ అని చెప్పినా, అక్కడ కూడా ఈ విషయం ప్రస్తావన రాలేదు. కేంద్రం పై ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు పవన్.
ఈ సందర్భంలో, రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీలపై నిధులు వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు పవన్ జేఎఫ్‌సీ పేరుతో ఓ కమిటీని వేశారని.. రాష్ట్రానికి రూ.74 వేల కోట్లు కేంద్రం ఇవ్వాలంటూ తేల్చిన ఆ కమిటీ సినిమా ఏమైందని ప్రశ్నించారు. ప్రశ్నించడానికి పవన్‌కు కేంద్ర ప్రభుత్వం కనపించడం లేదా? అని నిలదీశారు. దిల్లీలో జరిగిన లోపాయికారి ఒప్పందం ఏమిటో ఆ నాయకుడు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎలా లొంగిపోయింది, విభజన హామీల పై కనీసం ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనటం, నోటి వెంట మోడీ, అమిత్ షా అనే పేరు కూడా రాకుండా జాగ్రత్త పడటం చూస్తుంటే, బీజేపీ, పవన్ ను ఎలా ఆడిస్తుందో ఎవరైనా తెలుసుకోవచ్చు... ఇంతకీ ఆ జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటి ఏమైందో, ఏమిటో ? అంతా అమిత్ షా మాయ....