ఈ రోజు పార్లమెంట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో, తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానంతో, మరోసారి కేంద్రం ఎలా లెక్క లేకుండా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉందో అర్ధం అవుతుంది. ఇదే విషయం రామ్మోహన్ నాయుడు, సభలో కూడా ప్రస్తావించారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. ఈ సమాధానం చూస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు అంటే, మీకు లెక్క లేదా ? లేదా నిర్ల్యక్షమా అని ఘాటుగా ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేక పోయారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి, చట్టంలో పెట్టిన విషయాలు గురించి, అసలు కేంద్రం ఇప్పటి వరకు ఏమి చేసింది, అసలు ఏమి అమలు చేసింది, ఇంకా ఏమి అమలు చేయాలి అంటూ, విభజన చట్టం పై, రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి బదులు ఇచ్చిన మంత్రి, విభజన హామీల్లో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి, వివిధ మంత్రిత్వ శాఖలు వాటిని పరిష్కారం చేయటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు.

ram 23032021 2

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సహకరించి, ఇరువురూ కూర్చుని పరిష్కారం చేసుకోవాలి అంటూ తన సమాధానం చెప్పారు. అయితే దీనికి రామ్మోహన్ నాయుడు దీటుగా బదులు ఇచ్చారు. ఈ చట్టం ఉంది 10 ఏళ్ళు, ఇప్పటికే 8 ఏళ్ళు అయిపొయింది, ఇంకా చాలా పెండిన్ లో ఉన్నాయి, అదేమంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాలి అంటున్నారు, కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు మీరు ఏమి చేసారు, ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధం లేదు కదా, ఇందులో మీరు ఏమి చేసారు ? నేను అడిగిన దానికి సారైన సమాధానం లేదని, ఈ సమాధానం చూస్తుంటే లెక్క లేని తనమో, లేక తెలియని తనమో అర్ధం కావటం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే ప్రత్యెక హోదా ఏమైంది అని అడగగా, కేంద్ర మంత్రి మళ్ళీ అదే పాట పాడారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పారు. అయితే, విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో, కేంద్ర ప్రభుత్వం అంత సుముఖంగా లేదని, మరోసారి స్పష్టం అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read