టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు మరోసారి బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఉతికి ఆరేసారు... ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై తెలుగుదేశం ముఖ్యనేతలు, అందుబాటులో ఉన్న ఎంపీలతో చంద్రబాబునాయుడు ఈరోజు చర్చించారు... తరువాత, ఎంపీలు మీడియాతో మాట్లాడారు...రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసిందేనని, బీజేపీ మద్దతుతోనే ఏపీ విభజన జరిగిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో ఏపీని పోల్చి చూడాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే సహించబోమని, రాష్ట్ర విభజనతో చాలా ఆస్తులు కోల్పోయామని అన్నారు. ఏపీ తలసరి ఆదాయం చాలా తక్కువని, రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడగొట్టారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారని, ఇచ్చిన హామీని విస్మరించారని జయదేవ్ ఆరోపించారు. దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి మద్దతిస్తున్నాయని జయదేవ్ పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు ఇంకా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగేళ్లు దాటుతున్నప్పటికీ విభజన చట్టంలోని అంశాలపై స్పష్టత లేదని, రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, హేతుబద్ధత లేకుండా విభజించారని, విభజన తర్వాత కోలుకోవాలనే ఉద్దేశంతోనే విభజన చట్టం తీసుకొచ్చారని అన్నారు.
‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు దూరదర్శన్, పాస్ పోర్టు ఆఫీసులు ఇవ్వరా? మేమేమైనా పక్క దేశంలో ఉన్నామా? రైల్వేజోన్ విషయంలో సమాధానం ఇవ్వలేదు! రాజకీయ నిర్ణయం తీసుకుంటే రైల్వేజోన్ పై క్లారిటీ వస్తుంది. కంభంపాటి విడుదల చేసిన నివేదికలో విభజన హామీల ప్రస్తావనే లేదు. కుట్రలు చేస్తోంది వైసీపీ.. పోరాటాలు చేస్తోంది టీడీపీ. వైసీపీవి నిలకడలేని ప్రకటనలు, నిబద్ధత లేని పోరాటాలు. వైపీపీ నేతల రాజీనామాల సంగతి ఏమైంది? వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు!’ అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.