సిక్కోలు యువకెరటం ఐక్యరాజ్యసమితిలో, భారత దేశం తరుపున గర్జించింది... ఈ నెలఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు న్యూయార్కు లో జరుగిన ఐక్య రాజ్య సమితి సమావేశాలకు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు ,విద్యావేత్త అయిన కింజరాపు రామ్మోహనాయుడు పాల్గున్నారు... కేంద్రప్రభుత్వం, రామ్మోహనాయుడుని స్వయంగా ఎంపిక చేసి, దేశం తరుపున పంపించింది.. గతంలో కీర్తిసేసులు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఐక్యరాజ్య సమితి సమావేశాలలో పాలొన్నారు...

ram mohan 29102017 2

ఐక్యరాజ్య సమితిలో రామ్మోహనాయుడు స్పీచ్ అద్భుతం.. అంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా మాట్లాడేసరికి, కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా మెచ్చుకున్నారు... 'ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిషన్‌' ఆధ్వర్యంలో నిరాయుధీకరణ యంత్రాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్మోహన్‌నాయుడు ప్రసంగించారు... ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన బహుపాక్షిక విధానానికి భారతదేశం కట్టుబడి ఉందని, దేశాల మద్య తలెత్తుతున్న సమస్యలు, శాంతిని నెలకొల్పడం వంటివి నిజమైన ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు...

ram mohan 29102017 3

అంతర్జాతీయ శాంతికి, రక్షణకు భారతదేశం పాటుపడుతోందన్నారు. ఐరాస సిద్ధాంతాలకు భారత్‌ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. నిరాయుధీకరణలో ఐరాస కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల క్రితం నిరాయుధీకరణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసినా ఇప్పటికీ చాలా దేశాలు ఆయుధాలను తగ్గించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్ని కృషి చేయాలని గౌరవంగా భారతదేశం తరుపన కోరారు... ఈ స్పీచ్ మీరూ వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read