ఒక పక్క పోలవరంతో రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బంది పెడుతుంది... ఈ తరుణంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేటు బిల్ ఇవాళ ప్రవేశపెట్టి, కేంద్రాన్ని ఇరుకున పెట్టారు... శుక్రవారం ప్రైవేటు బిల్ ప్రవేశపెట్టిన తరువాత, లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ లేదని, దీంతో ఏపీ ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోందని వివరించారు. జోన్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లాలంటే అటు ఒడిశా, లేదా ఇటు తెలంగాణ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే రైల్వే జోన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైల్వే యాక్ట్ 1989 ను సవరించి విశాఖ హెడ్ క్వార్టర్స్‌గా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఆయన లోక్‌సభలో వివరించారు. వాల్టేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లను అందులో చేర్చాలని రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని కోరారు. మరి రామ్మోహన్ నాయుడు ఆక్షన్ కు, కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటందో చూడాలి... కేంద్రం కనుక ఒప్పుకుంటే, బిల్ పాస్ అవుతుంది. ఈ బిల్లు సభ ఆమోదం పొందితే మూడు నెలల్లో రైల్వే శాఖ చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి.
రెండు నెలల క్రితం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు పై లోక్‌సభలో బిల్లు పెట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు స్పీకర్‌కు లేఖ పంపారు. తరువాత లోక్‌సభ సెక్రటేరియట్, బిల్ పెట్టటానికి పర్మిషన్ ఇచ్చింది.. దానికి అనుగుణంగా, ఇవాళ రామ్మోహన్ నాయుడు బిల్ ప్రవేశపెట్టారు. ఈ బిల్ విషయంలో కేంద్రం వైఖరి తెలిసిపోనుంది... ఒక్క దెబ్బతో, అటో ఇటో తెల్చేయ్యటానికి ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో, రామ్మోహన్‌నాయుడు సరైన టైంలో స్పందించారు... కేంద్రం వైఖరి ఈ విషయంలో ఏంటో తెలిసిపోనుంది... ఇప్పటి వరకు రైల్వే జోన్ కోసం చేసిన ప్రయత్నాలతో పాటు, జోన్ ఏర్పాటుకు అవునో కాదో కేంద్రం తేల్చే సమయం వచ్చింది.