తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కర్తవ్యంగా భావించాలని శనివారం నుంచి అందరికీ మంచినీరు, భోజనం సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి సోంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే డా. బెందాళం అశోక్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు బాధిత గ్రామాలకు అధికారులు, కింది స్థాయి సిబ్బంది సైతం వెళ్లకపోవటం దురదృష్టకరమన్నారు.వ్యవసాయం, ఉద్యాన శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమీక్ష జరిపారు.

rammohan 13102018 2

ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో అధికారులు రాకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బృందాల వారీగా గ్రామాలకు వెళ్లి నష్టాలను అంచనా వేయాలని నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టొందని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు, కవిటి జెడ్పీటీసీ రమేష్‌ ఉన్నారు. తుపాను బాధిత గ్రామాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పర్యటించారు. బారువ బీల ప్రాంతంలో నష్టాలపాలైన వరి పంటను ఆయన పరిశీలించారు. అక్కడినుంచి బట్టిగళ్లూరు, ఎకువూరు, నడుమూరు, ఉప్పలాం, గొల్లవూరు, ఎర్రముక్కాం గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్‌, తెదేపా నాయకులు,రైతు నాయకులు ఉన్నారు.

rammohan 13102018 3

మరో పక్క చంద్రబాబు కూడా భరోసా ఇస్తూ కదులుతున్నారు. ‘‘భయపడొద్దు. ఆందోళన చెందవవద్దు. హుద్‌హుద్‌ సమయంలో పదిరోజులు విశాఖలోనే ఉండి అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు కూడా సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా పలాస, ఉద్ధానంలోనే ఉంటాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను బాధితులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్‌ సర్వే ద్వారా తుఫాను బీభత్సాన్ని పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి బాధితులను పరామర్శించారు. పలాస, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో పునరావాస చర్యలను పర్యవేక్షించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read