ఈనాడులో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎప్ప‌టి మాదిరిగానే అన్ని ఆధారాల‌తో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వైసీపీ స‌ర్కారు చేస్తున్న అరాచ‌కాలు, అవినీతినే ఈనాడు రాయ‌డంతో ఏం చేయ‌లేని జ‌గ‌న్ రెడ్డి క‌క్ష సాధింపుల‌కు మార్గ‌ద‌ర్శిని మార్గం చేసుకున్నాడు. ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌కున్నా ఈనాడు రామోజీరావుని ఇబ్బంది పెట్టి, ఈనాడు క‌థ‌నాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌నుకుని మార్గ‌ద‌ర్శి చిట్స్ పై దాడుల‌కు అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. రోజుల‌కొద్దీ మార్గ‌ద‌ర్శిలో సోదాలు జ‌రిపినా ఏం ప‌ట్టుకోలేక సాక్షిలో త‌ప్పుడు రాత‌లు రాసి సైకో ఆనందం పొందారు. ఇదే స‌మ‌యంలో రామూ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఈనాడుపై సోష‌ల్మీడియా వేదికగా వికృత రాత‌లు పోస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. అయితే ఎక్క‌డా రామోజీరావు త‌గ్గ‌లేదు. ఈనాడు అంత‌కంటే త‌గ్గ‌లేదు. చిట్స్ చ‌ట్టం కింద రామోజీని బుక్ చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేసినా ఒక్క కేసు పెట్ట‌డానికి ఆధారం దొర‌క‌లేదు. మార్గ‌ద‌ర్శిపైనా, రామోజీరావుపైనా ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ మంత్రి అంబ‌టి రాంబాబు అదే చిట్స్ నేరంపై పోలీసు కేసు బుక్ అయ్యింది. అంబ‌టి రాంబాబు ఆదేశాల‌తో సత్తెనపల్లిలో కొన్నేళ్లుగా సంక్రాంతి డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వ‌లంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది సైతం ఈ డ్రా టికెట్లు అమ్మార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిపై జ‌న‌సేన నేత‌లు కోర్టులో పిటిష‌న్ వేశారు. కోర్టు ఈ డ్రా వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించింది. అయితే కోర్టులు ఏం చేసినా డ్రా జ‌రిగి తీరుతుంద‌ని అంటి స్ప‌ష్టం చేశారు. అలాగే డ్రా కూడా తీశారు. హైకోర్టు  ఈ డ్రా వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డంతో, ఆ డ్రా ముగిసిన త‌రువాత సత్తెనపల్లి పోలీసులు చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. రామోజీరావుని ఇదే చ‌ట్టం కింద బుక్ చేయాల‌నుకుని రాంబాబు బుక్ కావ‌డం దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు స‌త్తెన‌ప‌ల్లి  నేత‌లు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read