అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వ అధినేత అయిన ముఖ్య‌మంత్రికి ఇవి ఎంత ముఖ్య‌మో అంద‌రికీ తెలిసిందే క‌దా. అయితే ఢిల్లీ నుంచి మోదీ షాల నుంచి పిలుపు. వెళ్ల‌క త‌ప్ప‌లేదు. ప‌రుగులు పెట్టాడు. ప్ర‌తీసారీ ఢిల్లీ వెళ్లి ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం క‌ల‌రిచ్చే జ‌గ‌న్ రెడ్డి ఈ సారి ఈయ‌న వెళ్ల‌లేదు, వారే పిలిపించార‌ని టాక్. మార్గ‌ద‌ర్శి విష‌యంలో రామోజీరావుని ఎలాగైనా అరెస్టు చేయాల‌ని జ‌గ‌న్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల‌ను పాటిస్తున్న‌ట్టు న‌టిస్తూనే ఉన్న‌తాధికారులు మొత్తం స‌మాచారం ఈనాడు అధిప‌తి రామోజీరావుకి అంద‌జేశారని లీకులు వ‌స్తున్నాయి. ఈనాడు రామోజీరావు ఎంత ప‌వ‌ర్ ఫుల్లో తెలిసి కూడా పులిబోనులోకి త‌ల‌పెట్టి చూశాడు జ‌గ‌న్ రెడ్డి. పులికి కిత‌కిత‌లు పెట్ట‌నారంభించాడు. రామోజీ త‌న ప‌వ‌రేంటో చూప‌డం మొద‌లు పెట్టారని, ఈ దెబ్బ‌కే మోదీ షాల నుంచి పిలుపు వ‌చ్చింద‌ని, అందుకే అసెంబ్లీ జ‌రుగుతున్న ఢిల్లీకి ప‌రుగులు పెట్టార‌నే ప్ర‌చారం సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల‌ను క‌లుస్తార‌ని సీఎంవో మీడియాకి లీకులిచ్చింది. అయితే పిలిచింది వారే కాబ‌ట్టి త‌లంటి పంపుతార‌ని, ఇది సీఎం జ‌గ‌న్ రెడ్డి కోరిన అపాయింట్మెంట్ కాద‌ని తాడేప‌ల్లివ‌ర్గాల భోగ‌ట్టా. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మ‌రోవైపు త‌న త‌మ్ముడు ఆయ‌న తండ్రి సీబీఐ బొక్క‌లో వేసే ప‌నిలో ఉంద‌ని తెలిసినా త‌ప్ప‌నిస‌రై ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌కెళ్లాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రోవైపు టిడిపి కొత్త వాద‌న వినిపిస్తోంది. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయార‌ని..నేడే రేపో అరెస్టు త‌ప్ప‌ద‌ని..అలాగే బాబాయ్ హ‌త్య‌కేసులో అబ్బాయ్ జ‌గ‌న్ రెడ్డి పాత్ర ఉంద‌ని...అందుకే ఆగ‌మేఘాల ఢిల్లీ టూర‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read