ఉదయం మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, గల్లా జయదేవ్ ఇచ్చిన రీసౌండ్ చెవిల్లో నుంచి బీజేపీ నేతలకు, ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తుంటే, సాయంత్రం శ్రీకాకుళం ఎంపీ రాం మోహన్ నాయుడు అందుకున్నారు. అలా ఇలా కాదు, గల్లా క్లాస్ గా కొడితే, రాంమోహన్ నాయుడు హిందీలో మాస్ గా వాయించి పడేసారు. దివంగత ఎర్రన్నాయుడుని గుర్తు చేస్తూ, ఇచ్చిన పది నిమషాల టైంలో గడగడ హిందీలో మాట్లాడుతూ, శభాష్ అనిపించారు. 5 కోట్ల మంది తెలుగు ప్రజల బాధను, హిందీ భాషలో దేశమంతటా అర్ధమయ్యేలా చెప్పారు. అన్ని విషయాలు చెప్తూ, ప్రధాన మంత్రి గారు సమాధానం చెప్పండి అంటూ, గర్జించారు. ఉదయం గల్లా జయదేవ్ ఆపిన చోటు నుంచి, రాము అందుకున్నాడు.

ramu 2007218 2

విశాఖలో కావలసినంత భూమి, పోర్టు, పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా చందమామ కథలు చెబుతున్నారని విమర్శించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరుగుతుందని అప్పటి ప్రధాని ప్రత్యేకహోదా ప్రకటించారని, ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు నాడు మాట్లాడిన విషయాలను ఆయన ప్రస్తావించారు. విభజన చట్టాన్ని అదే స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని డిమాండ్ చేశారు. చాలాసార్లు ఢిల్లీకి వచ్చిన మా సీఎం, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ గురించి అడిగితే వేరే విషయాలు మాట్లాడుతన్నారని, అసలు.. విశాఖలో రైల్వోజోన్ ఏర్పాటు చేయడానికి ఉన్న ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు.

ramu 2007218 3

విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదని, సభ సాక్షిగా బీజేపీ ఎంపీ హరిబాబు అసత్యాలు ప్రచారం చేశారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. టీడీపీకి 15 మంది ఎంపీలున్నారని, తమను తక్కువగా తీసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య ఆలయం పార్లమెంట్ అని, తమకు అన్యాయం జరిగింది ఈ సభలోనే కనుక, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అడుగుతామని ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ విధానం ఏమిటో ఈరోజు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read