రమ్య ఉదంతంలో, జగన్ ప్రభుత్వం, ఆ కుటుంబానికి పది లక్షలు ఇచ్చింది అంటూ, వైసీపీ ప్రభుత్వం, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అసలు విషయం బయట పెట్టింది టిడిపి. ఆ పది లక్షలు, జగన్ మోహన్ రెడ్డి ప్రేమతో ఇచ్చింది ఏమి కాదని, దళిత చట్టాల ప్రకారం, చట్టం ప్రకారం ఆ పది లక్షలు ఇచ్చారు అంటూ అసలు విషయం చెప్పారు. దిశా చట్టం ప్రకారమే కేసులు, శిక్షలు అమలవుతున్నాయని వైసీపీ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచి తేలుస్తోందని, నిజంగా ఆ చట్టం రాష్ట్రంలో అమల్లో ఉంటే, దాని విధివిధానా లు, నిబంధనలు, సెక్షన్లు, శిక్షలేమిటో చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన దిశా చట్టమే లేదని చెబుతుంటే, జగన్ ప్రభుత్వం ప్రజలను ఎలా మోసగిస్తుంది ? దళితులకు అట్రాసిటీ చట్టమున్నట్లే, రాష్ట్రంలో ఆడ పిల్లలను వే-ధిం-చే-వా-రి-కి, వారిని హిం-సిం-చే వారికి, అ-త్యా-చా-రా-లు చేసే వారికి, చం-పే-సే వారికి ఈ చట్టం వర్తిస్తుందని ఎక్కడుంది? అలాంటి విధివిధానాలు ఎక్కడున్నాయి? దిశా చట్టం ప్రకారం ముగ్గురికి ఉ-రి శిక్షలు, 20 మందికి యావజ్జీవ శిక్షలు వేశామని హోంమంత్రి చెబుతుంటే, ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఆడబిడ్డలపై ఆకృ-త్యా-లు, అ-ఘా-యి-త్యా-ల-కు పాల్పడేవారిపై ఎలాంటి సెక్షన్లు పెడుతున్నారు... ఏ విధంగా శిక్షిస్తున్నారనే వివరాలను పోలీసులు ఎందుకు చెప్పడంలేదు? దిశా చట్టమనేది పచ్చి బూటకం. ప్రభుత్వం కావాలనే లేని చట్టాన్ని తన స్వలాభం, ప్రతిష్ట కోసం వాడుకుంటోంది. దిశా చట్టముందని, దానిపేరుతో యాప్ ఏర్పాటు చేశామని చెప్పడం అంతా కేవలం సాక్షి పత్రికల్లో ప్రకటనల కోసమే. అంతేగానీ ఆడ బిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం దాన్ని తీసుకు రాలేదు. ఆడ బిడ్డల జోలికొస్తే, ఇదిగో ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తామని, దాని విధివిధానాలు ఇవీ అని ప్రభుత్వం బాహాటం గా ఎందుకు చెప్పలేకపోతోంది?

దళితుల రక్షణార్థం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టమున్నట్టే, రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణార్థం వారికి న్యాయం చేయడంకోసం పలానా చట్టముందని జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చెప్పడంలేదు? 141 మంది దళిత మహిళలు, యువతులు, చిన్నారులపై దారుణాలు జరిగాయి. ఆయా సంఘటనల్లో గన్ కంటే ముందు జగన్ వచ్చాడా? 141 మందిలో ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందరిని కాపాడి, నిందితుల్లో ఎందరిని శిక్షించింది? రమ్యశ్రీ చ-ని-పో-యా-క, ఆమె కుటుంబానికి ప్రభుత్వమిచ్చిన సాయం కూడా దళితులకు చట్టప్రకారం చేసేదే తప్ప, జగన్మో హన్ రెడ్డేమీ మానవత్వంతో స్పందించి, తనకు తానుగా ఇచ్చింది కాదు. ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు నమోదు కాబట్టే, రమ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల సాయం చేసింది . లేని అబద్దపు చట్టాన్ని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది తప్ప, వాస్తవంలో ఎక్కడా అది అమల్లో లేదు. హోంమంత్రి చెప్పినట్టుగా నిజంగా దిశా చట్టం కిందే ముగ్గురికి ఉ-రి శిక్షలు, 20 మందికి యావజ్జీవ శిక్షలు వేస్తే, తక్షణమే ఆమె, నిందితుల పూర్తి వివరాలతో, ఎప్పుడెప్పుడు వారికి ఎక్కడ శిక్షలు వేశారో తెలియ చేస్తూ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దిశా చట్టమే లేనప్పుడు హోంమంత్రి శ్వేతపత్రం ఎలా విడుదల చేస్తారు? 141 రోజుల్లో దళిత ఆడబిడ్డలపై అరాచకానికి పాల్పడిన వారిలో ఈ ముఖ్యమంత్రి ఎందరిని శిక్షించాడు? రమ్యను హత్య చేసిన నిందితుడిని 20 రోజుల్లో ముఖ్యమంత్రి శిక్షించాలి. లేకుంటే నారాలోకేశ్ నాయకత్వంలో రమ్యశ్రీ కుటుంబంతో పాటు, ఆడబిడ్డలను పోగోట్టుకున్న ప్రతి కుటుంబానికి, ప్రభుత్వం న్యాయం చేసే వరకు టీడీపీ పోరాడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read