పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ, తన తండ్రిని చం-పి, రెండేళ్లు.. న్యాయం ఇంకెప్పుడూ అని సమాజాన్ని ప్రశ్నిస్తోందని, ఆమె సాదాసీదా మహిళ కాదని, దివంగత వై.ఎస్. వి-వే-కానందరెడ్డి కుమార్తెని, ఆమె ఏ రాజకీయ కుటుంబం నుంచైతే వచ్చారో, అదే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా, ఇప్పుడు రెండున్నరేళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! వివేకా కేసు విచారణ సీబీఐ చేపట్టి కూడా దాదాపు రెండేళ్లయింది. ఈ మధ్యనే కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. సుధాసింగ్ అనే డీఐజీ స్థాయి మహిళా అధికారి వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రధాన సాక్షి వాంగ్మూలాన్ని జమ్మలమడుగులో న్యాయమూర్తి ముందు రికార్డు చేయించారు. ప్రధాన సాక్షి అయిన రంగయ్య స్టేట్ మెంట్ ను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. ముఖ్యమంత్రికి సుపారీ విషయం తెలిసన వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, ఎవరా ఇద్దరు ప్రముఖులు.. వెంటనే పట్టుకోండని చెప్పాల్సిన బాధ్యతలేదా? వెంటనే డీజీపీని పిలిచి, ఎవరా ఇద్దరు...ఏమా సుపారీ కథో తేల్చమని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? రూ.8కోట్ల సుపారీ ఇచ్చారంటే ... ఆ హ-త్య వెనుక ఎంత పెద్ద వ్యవహారం దాగి ఉంటుంది? రంగయ్య వాంగ్మూలం రికార్డు చేశాక, ముఖ్యమంత్రి గానీ, డీజీపీ గానీ స్పందిస్తారని నేను ఈ రెండు రోజులు ఎదురు చూశాను. కానీ వారిద్దరూ స్తబ్దుగా, నిమ్మకునీరెత్తినట్లు కూర్చు న్నారు. ఎవరైతే ప్రధానసాక్షి ఉన్నాడో.. అతని వాంగ్మూలం ఎప్పుడైతే రికార్డు చేయించారో.. ఆ వెంటనే సీబీఐ బృందంలో మార్పులొచ్చేశాయి. సీబీఐకి నేతృత్వం వహిస్తున్న సుధాసింగ్ అనే మహిళా అధికారిని కేసు బాధ్యతల నుంచి తప్పించి, బదిలీ చేయించారు. ఎవరు ఆమెను బదిలీ చేయించారు? ఒకప్రధాన సాక్షి వాంగ్మూలం రికార్డు చేయించాక, ఇక మిగిలింది అరెస్ట్ లే. అటువంటి కీలక సమయంలో దర్యాప్తు అధికారి సుధాసింగ్ ను బదిలీ చేయించడం ద్వారా కేసు విచారణను నీరుగార్చడానికి ప్రయత్నించారని స్పష్టమవుతోంది. డీఐజీ స్థాయి అధికారి అయిన సుధాసింగ్ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా కేసు ప్రాధాన్యతను తగ్గించారు.

cbi 25072021 2

ఇద్దరు ప్రముఖులు రూ.8కోట్ల సుపారీ ఇచ్చినట్టా లేదా? అసలు ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు? కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేస్తారా ...చేయరా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఏమవుతుందనే సందేహం ప్రతిఒక్కరీ మెదళ్లను తొలుస్తున్నది. అందుకు కారణం సుధాసింగ్ ను బదిలీ చేయడమే. సీబీఐ కూడా రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్నదని అంటుంటే తాను విన్నాను. ఆ మాటలకు వాస్తవం చేకూరుస్తూ, వరుసగా జరిగిన సంఘటనలే నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారిని బదిలీ చేసి, ఎస్పీ స్థాయి అధికారికి విచారణ బాధ్యతలు అప్పిగిస్తే, కేసు విచారణ సక్రమంగా జరుగుతుందా? ఈ మూడు రోజుల్లో దర్యాప్తులో చీమ కూడా చిటుక్కుమనలేదు. ఈ వ్యవహారంపై స్పందించాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే. తన బాబాయి కేసు విచారణలో ఇంత జాప్యం జరుగుతుంటే ముఖ్యమంత్రికి ఏమీపట్టదా? చంద్రబాబు, నారాలోకేశ్, సతీశ్ రెడ్డి, మరి కొందరు కుట్రలు చేసి వివేకాను చం-పిం-చా-ర-ని కూడా వ్యాఖ్యానించారు. అదంతా అయ్యాక జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, వివేకా కేసుని విచారిస్తున్న సిట్ పై తనకు నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తు నకు ఆదేశించాలని కోరాడు. మరిప్పుడు దోషులను శిక్షించాలనే ఆలోచన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అక్కరలేదా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read