ఎవరు, ఎవరి పక్షమో, ఎన్నికల ముందు తెలవదు కాని, ఎన్నికల తరువాత మాత్రం, ఇట్టే అర్ధమై పోతుంది. ఎన్నికల ముందు వరకు, జనసేన, తెలుగుదేశం ఒకటే అని జగన్ ప్రచారం చేసారు. ఎన్నికలు ముగిసిన తరువాత, తన పార్టీ సమీక్షల్లో, పవన్ మాట్లాడుతూ, మనం ఓడిపోతే ఓడిపోయాం, చంద్రబాబుని ఓడించేలా మన పాత్ర కూడా మనం ప్లే చేసాం అని చెప్పి, ఆయన అభిప్రాయం ఏంటో చెప్పకనే చెప్పారు. ఈ రోజు అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే, జగన్ ను కోర్కెలు తీర్చే దేవుడిగా అభివర్ణించారు. అందుకే ఎన్నికల తరువాత, ఎవరు ఏంటో తెలిసిపోతుంది అని చెప్పింది. ఈ రోజు బడ్జెట్ పై ప్రసంగంలో, జనసేన పార్టీ తరుపున, పవన్ కళ్యాణ్ తరుపున మాట్లాడుతున్నా అంటూ స్పీచ్ మొదలు పెట్టిన, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసిపీ పార్టీ నేతల కంటే ఎక్కువ జగన్ భజన చేసారు. దేవుడు, సూరుడు అంటూ జగన్ ను ములగ చెట్టు ఎక్కించారు.
ఒక పక్క బడ్జెట్ కేటాయింపుల్లో అన్నీ కోతలు ఉంటే, ఇది ఒక అద్భుతమైన బడ్జెట్ అని, జగన మంచి పనులు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ చెప్పమన్నారని, రాపాక చెప్పారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే యువతకు, నిరుద్యోగ బృతి కోసం సున్నా కేటాయించినా, అద్భుతం అని పొగుడుతున్నారు. అమ్మ ఒడి పధకంలో సగం మందికి కోత పెట్టినా సూపర్ అంటున్నారు. రైతులకు విత్తనాలు ఇవ్వకపోయినా, ఇంత వరకు రైతులకు ఇలాంటి బడ్జెట్ పెట్టలేదు అన్నారు. అప్పట్లో వైఎస్ తరువాత, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమె, రైతులును ఆదుకున్నారని, జనసేన తరుపున అభినందనలు తెలుపుతున్నా అని అన్నారు. దేవుడు మనం ఏదైనా కోరిక అడిగితె తీర్చుతారని, అయితే కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని జనసేన పార్టీ తరుపున చెప్తున్నా అంటూ, రాపాక చెప్పుకొచ్చారు. ఇది జగన్ పార్టీ పై, జనసేనకు ఉన్న అభిప్రాయం.