రాష్ట్రంలో శాంతి బధ్రతలకు విఘాతం కలిగించటానికి, ప్రజల్లో ఆందోళన కలిగించటానికి, ఒక అనిశ్చితి పరిస్థితి నెలకొల్పటానికి, గత కొన్ని రోజులుగా, కొన్ని పక్షాలు చెయ్యని పని లేదు... ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్స్ అప్, ఉపయోగించుకుని, పల్లెల్లో ఉన్న వారకి కూడా విష ప్రచారం ఎక్కించేస్తున్నారు... తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి, పల్లెల్లో ఉన్న వారికి, ఈ సైకో గ్యాంగ్, భయంకరమైన ప్రచారం చేస్తుంది... పార్ధీ గ్యాంగ్ కదలికలు ఉన్నాయని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చూసి, ప్రజానీకం భయ భ్రాంతులకు గురి అవుతున్నారు... మొన్న చిత్తూరు జిల్లా, నిన్న ప్రకాశం, నేను కృష్ణా జిల్లా, ఎక్కడ చుసినా పల్లెల్లో ఇదే ఆందోళన.. ప్రజానీకం భయ భ్రాంతులకు గురై వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా రోడ్లు వెంట యువకులు కాపలా కాస్తున్నారు.
అనుమానంగా తెలుగు భాష రాని వ్యక్తులు కనబడితే చితక బాదుతున్నారు. అదే క్రమంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళేవారు తిరుగుతున్నారని అపోహలతో అట్టడుకి పోతుంది. పిల్లలను ఎత్తుకెళ్ళి, అవయవాయలు కోసేసి, అమ్ముకుంటున్నారు అని, కొన్ని ఫోటోలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు... గ్రామాలలో ఎస్సైలు తమ సిబ్బందితో పల్లె నిద్ర చేసి గ్రామస్తులకు అసత్య ప్రచారాలపై అవగాహన కల్పిస్తు న్నారు. అన్ని గ్రామాల్లో పోలీసులు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేయడంతో పాటు పల్లెనిద్ర కార్యక్రమాన్ని పూర్తి చేసేందకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగి ప్రశాంతంగా నిద్రపోవడం ప్రారంభించారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల అనేక మంది అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎస్సై తమ సిబ్బంది గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, మహిళలను సమావేశ పరిచి వదంతులు నమ్మవద్దని చెబుతున్నారు. అంతే కాకుండా ఆ రాత్రంతా ఆ గ్రామంలో పోలీసులు నిద్రపోవడంతో గ్రామస్తుల్లో ఆత్మ స్థయిర్యం పెరిగింది. సోషల్ మీడి యాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, అలాంటి విషయాలు ప్రచారం చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వివరిస్తున్నారు. మూడురోజులుగా పోలీసులు చేస్తున్న యత్నాలు ప్రజల్లో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. వారం రోజులుగా కంటిమీద కునుకు లేని పల్లెలు ప్రశాంత వాతావరణంలోకి చేరుకున్నాయి.