దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని కూల్చే ప్రయత్నాలు చూస్తున్నాం, గవర్నర్లను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని, రాష్ట్రాల పై ఎలా కక్ష సాదిస్తున్నారో చూస్తున్నాం. ప్రత్యేక్ష ఉదాహరణ కర్నాటకలో జరుగుతున్న రచ్చ. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఆ ప్రభుత్వాన్ని పడేయటానికి ఎంతో రచ్చ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలను కొనే బాధ్యత ఏకంగా ఢిల్లీ పెద్దలే తీసుకున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ సంగతి అయితే సరే సరి. ఇప్పుడు తాజాగా జీవీఎల్ నరసింహారావు, మీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం జాగ్రత్తా అంటూ హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరులో వారు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సోమవారం కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు చెప్పారు. ఉదయం విజయవాడలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఆకివీడులో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్క గడ్కరీ మంత్రిత్వశాఖ నుంచే రూ.3లక్షల కోట్లు ఏపీకి వచ్చాయన్నారు.
చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్ హెచ్చరించారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాతో పెట్టుకుని, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే, రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తా అని హెచ్చరిస్తుంటే ఏమి చెయ్యాలి ?