ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతాం జాగ్రత్తా అంటూ, నిన్న బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హెచ్చరించిన సంగతి తెలిసిందే. వీళ్ళ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరిస్తున్నారని, వాళ్ల బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ.. ఏపీకి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ ఏపీకి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.

cbn counter 21012019

యూపీ రోడ్లుకు ఇచ్చిన నిధుల కన్నా 7 రెట్లు తక్కువ ఏపీకి ఇచ్చారని, మహారాష్ట్ర రోడ్ల కన్నా 4 రెట్లు తక్కువ ఇచ్చారన్నారు. ఏపీ రహదారుల అభివృద్ధికి కేవలం రూ.5,399 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. ఏపీలో పర్యటించేందుకు వారానికి ఓ కేంద్రమంత్రి వస్తారని, రాష్ట్రానికి ఏం మేలు చేశారని వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా బెదిరింపులు కూడా చేస్తున్నారన్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమంతా అవినీతి, ఆర్భాటం, ప్రచారం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని, వీటిని వివరించటానికి వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

cbn counter 21012019

చంద్రబాబు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మోదీ తిరిగి ప్రధాని అయితే జైలుకు పోవాలనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారని వారు ఆరోపించారు. టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని జీవీఎల్‌ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై పెద్ద దుమారమే రేగింది. ఏమున్నా రాజకీయంగా తేల్చుకోవాలని, మాకు ఢిల్లీలో అధికారం ఉంది కదా అని, ఈ దేశం మొత్తం సొంత జాగీరుగా బీజేపీ నేతలు వ్యవహరించటం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి, రాష్ట్రపతి పాలన పెట్టిస్తాం అని బెదిరించటం పై, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read