నంద్యాల పట్టణంలో ఈ రోజు తెల్లవారుజామున వైకాపా తరుపున ఓటుకు వెయ్యి రూపాయలు చోప్పున ఓటర్లకు పంపిణీ చేస్తున్న 67 మందిని నంద్యాల పోలీసులు ఆదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.... వీరిలో ఎక్కువ మంది, కడప,పులివెందుల, బేతపూడి , నంద్యాల, కర్నూలు , నెల్లూరు కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వైకాపా తరుపున తెల్లవారుజామన 3.30 నుండి ఓటర్లుకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు నిర్దారించారు.
పట్టుబడిన వారిలో జగన్ మేనమామ, కడప జిల్లా కమలాపురం MLA రవీంద్రనాథ్ రెడ్డి PA బ్రహ్మానందం, పులివెందుల కౌన్సిల్లర్లు అశ్వని కుమార్, భాస్కర్ లు, కడపలో కార్పొరేటర్ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన కిరణ్, ఇంకా రాయచోటి, బద్వేల్, నియోజకవర్గాల నించి వ్యక్తులు ఉన్నారు.
మొత్తం మీద జగన్ బండారం ఈవేళ పూర్తిగా బద్దలైంది. నా దగ్గర పేపర్ లేదు, ఛానల్ లేదు, డబ్బు లేదు అంటున్న జగన్ ని చూసి సిబిఐ భయపడుతోంది. ఎందుకంటే, రేపు కేసుల్లో శిక్ష పడ్డాక నేను జగన్మోహన్ రెడ్డిని కాను అని అంటాడేమోనని.