ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ రాయలసీమ ఎత్తిపోతల పధకం. దీని పై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. మంచి స్నేహితులం, రాయలసీమను రత్నాల సీమను చేస్తాం, అంటూ గొప్పలు చెప్పుకున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూర్చుని మాట్లాడకుండా అయిపోయేదానికి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోర్టుల వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు కోర్టులో జగన్ ప్రభుత్వానికి మంచి ఆయుధం దొరికింది. ఆ ఆయిధం గతంలో చంద్రబాబు ముందు చూపుతో చేసిన పని. రాయలసీమకు కృష్ణా జలాల్లో ఎలాంటి కేటాయింపులు లేనప్పుడు, అసలు సీమకు కృష్ణా నీళ్ళు తీసుకువెళ్ళే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారు అనేది తెలంగాణా ప్రభుత్వం వాదన. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు పాటిస్తూ, ఏ ప్రాంతానికైనా కృష్ణా నీళ్ళు వాడుకోవచ్చు అంటూ నాడు చంద్రబాబు, కేసీఆర్ చేత ఒప్పందం చేపించారు. సరిగ్గా అదే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఒక పెద్ద ఆయుధంగా మారింది. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ వాదనలు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి 111 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఇచ్చిన నివేదిక పై తెలంగాణా అభ్యంతరం చెప్తుంది.

seema 25082020 2

అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మాత్రం ధీమాగా ఉంది. సీమ ఎత్తిపోతలకు ఎలాంటి ఇబ్బందులు రావని, గతంలో కేంద్రం సమక్షంలో, తెలంగాణా ప్రభుత్వమే దీని పై ఒప్పుకుందని, ధీమాగా ఉంది. 2015 జూన్ 18, 19 తేదీల్లో, కేంద్రంలో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణా నుంచి ఎస్ కే జోషీ హాజరు అయ్యి, ఒక ఒప్పందం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని భీమా పథకం నుంచి 20 టీఎంసీల నీటిని మేము తీసుకుంటామని, ఇది ఒప్పుకుంటేనే, సీమ ప్రాజెక్ట్ లకు కృష్ణా జలాల పై ఒప్పుకుంటామని తెలంగాణా భీష్మించింది. ఒకానొక సమయంలో ఈ ఒప్పందం చెయ్యకుండా వాక్ అవుట్ చెయ్యటానికి కూడా తెలంగాణా నిర్ణయం తీసుకుంది. అయితే విషయం చంద్రబాబుకు తెలియటంతో, ఆదిత్యనాథ్ దాస్ తో చర్చలు జరిపి, భీమా పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తయ్యిందని, దీని పై మనం అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు అంటూనే, వ్యూహాత్మికంగా వ్యవహరించారు.

seema 25082020 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటి కేటాయింపుల పై లిఖితపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే, భీమా పథకం నుంచి 20 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు ఎత్తుగడ ఫలించి, ఈ ఒప్పందం సాకారం అయ్యింది. కేటాయించిన కృష్ణా జలాలను, ఏ ప్రాంతంలో అయినా వాడుకోవచ్చు అని ఒప్పందం చేసుకున్నారు. తరువాత 2016లో ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన మొట్టమొదటి అపెక్స్ సమావేశంలో కూడా ఈ ఒప్పందానికి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలిపారు. దీంతో కృష్ణా జలాలు రాయలసీమ వాడుకుంటానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఒప్పందమే జగన్ ప్రభుత్వానికి ఆయుధం అయ్యింది. రాయలసీమ ఎత్తిపోతల పధకం న్యాయపోరాటంలో, ఈ ఒప్పందం చూపిస్తే, తెలంగాణా వాదనకు బలం లేకుండా పోతుందని, తద్వారా ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెలుస్తుందని, ఏపి వర్గాలు భావిస్తున్నాయి. ఆ నాడు చంద్రబాబు దార్శనికుని ముందుచూపుకు ఇదొక ఉదాహరణ

Advertisements

Advertisements

Latest Articles

Most Read