ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఎలా అయినా అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ తహతహలాడుతుంది. ఇందు కోసం అన్ని ప్లాన్లతో రెడీ అయ్యి, రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పగ్గాలు తమ చేతికి రావాలని బీజేపీ అనుకుంటుంది. తెలంగాణాలో అయితే అధికారం ఖాయంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, అధికారంలోకి రాకపోయినా, ప్రతిపక్ష హోదా మాత్రం సంపాదిస్తామని చెప్తున్నారు. తెలంగాణాలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీలు బలహీనంగా ఉన్నాయని, వాళ్ళ స్థానం కైవసం చేసుకోవటానికి, ఇదే మంచి అవకాసం అని బీజేపీ నమ్ముతుంది. తెలంగాణాలో అటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసిన బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది.

ryapati 22072019 2

ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు దెబ్బ పడితే తెలుగుదేశం మళ్ళీ కోలుకోలేదని బీజేపీ అంచనా వేస్తుంది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేశారు. అయితే, నాయుకులను లాగినంత మాత్రానా, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. ఈ నాయకులు కూడా గ్రౌండ్ లెవెల్ తో సంబంధం లేని వాళ్ళు. గట్టిగా ఒక వార్డ్ లో కూడా గెలవలేని నాయకులు. ఈ నేపధ్యంలోనే వారం రోజుల క్రిందట రాంమాధవ్, గుంటూరు జిల్లా నేత, మాజీ ఎంపీ రాయపాటి ఇంటికి వెళ్లి, బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే అప్పుడు రాయపాటి మాత్రం, ఏ నిర్ణయం ప్రకటించలేదు. త్వరలోనే ఢిల్లీ వచ్చి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడతాఅని చెప్పారు. రాయపాటి ఢిల్లీ అయితే వెళ్ళలేదు కాని, ఈ రోజు తిరుమలలో మాత్రం కీలక ప్రకటన చేసారు.

ryapati 22072019 3

తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాయపాటి, తాను త్వరలోనే బీజేపీ పార్టీలో చేరుతున్నా అని మీడియాకు చెప్పారు. తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదని, మోడీ పాలన నచ్చి, బీజేపీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. అయితే గత వారం రాంమాధవ్, రాయపాటిని కలిసిన విషయం, ఆ ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రాం మాధవ్ ని కలిసిన మరుసటి రోజే, రాయపాటి, చంద్రబాబుని కలిసి విషయం చెప్పారని, బీజేపీ ఒత్తిడులు తట్టువాలి అంటే, పార్టీ మారక తప్పదు అని చెప్పటంతో, చంద్రబాబు కుద, మీ ఇష్టం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే రాయపాటి పార్టీ మార్పు పై మాత్రం, టిడిపి కార్యకర్తలు మరో రకంగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతే, పార్టీకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని, చంద్రబాబు ఎలాగూ వీళ్ళను దూరం పెట్టలేరని, వీళ్ళే వెళ్ళిపోతే, చంద్రబాబు కొత్త వారికి అవకాసం ఇస్తారని, పార్టీకి నూతన రక్తం వస్తుందని టిడిపి కార్యకర్తలు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read