రాష్ట్రంలో ఒక కులం టార్గెట్ గా, ప్రభుత్వం, ఏకంగా సియం, మంత్రులు ముందుకు వెళ్తుంటే, ఆ పార్టీ అనుచరులు కూడా, ఇలాగే చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక కులం అంటూ, అమరావతిని నాశనం చేసారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక కులం అంటారు, ఆ కులం ఉంటే, పోస్టింగులు కూడా ఉండవు అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చివరకు ఎన్నికల కమీషనర్ కు కూడా కులం అంటగట్టి, కులం కులం అంటూ, 65 మంది ప్రెస్ మీట్లు పెట్టి, ఎన్నికల కమీషనర్ పై, మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇంత జరుగుతున్నా, ఆ కులం మాత్రం, వీరి మాటలు పట్టించుకునే పనిలో లేరు. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే, కొంత మంది మాత్రం, ఏకంగా ఒక సియం, కులం పేరు చెప్తూ, సమాజంలో చీలిక తేవటం పై కొంత మంది గళం విప్పుతున్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, అధికార పక్షం చేస్తున్న కుల రాజకీయం పై మండిపడ్డారు.
నిన్న అమరావతి రైతుల కోసం, ఒక రోజు దీక్ష చేసిన డాక్టర్ కు సంఘీభావం తెలుపుతూ, రాయపాటి మీడియాతో మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ఒకే మూస పద్దతిలో వెళ్తున్నారని అన్నారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ, కమ్మ కమ్మ అంటూ, గోల గోల చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలో కీలక పోస్టింగులు అన్నీ రెడ్డి కులానికే ఇస్తున్నారని, వేరే కులం వారిని పట్టించుకోవటం లేదని, ఇక కమ్మ వారు అని తెలిస్తే, అసలే పక్కన పడేస్తున్నారని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని, ప్రభుత్వాలు ఇలా ఉండకూడదు అని అన్నారు. చివరకు కరోనాతో మనుషులు చచ్చిపోతారని, ఎన్నికలు వాయిదా వేస్తే ఎన్నికల కమీషనర్ కు కూడా కులం అంటగట్టారని, ఈ రోజు ఎన్నికలు పెట్టి ఉంటే ఏపి ఏమయ్యేది అని అన్నారు. కరోనాతో తగ్గిన తరువాత, ప్రధాని దగ్గరకు వెళ్లి అన్నీ చెప్తానని అన్నారు.
అయితే రాయపాటి వ్యాఖ్యల పై వైసీపీ వేరే రకంగా ప్రచారం చేసింది. కమ్మవారితో పెట్టుకుంటే, లేచిపోతారు అంటూ, రాయపాటి అన్నారు అంటూ, ప్రచారం చేసారు. పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో, రాయపాటి వెంటనే స్పందించారు. ఒక కులం పై జగన్ చూపిస్తున్న ద్వేషం పైనే నేను మాట్లాడానని అన్నారు. జగన్ ఒక ముఖ్యమంత్రిగా అన్ని కులాలను కలుపుకుని పోవాలని అన్నానని అన్నారు. జగన్ ప్రభుత్వంలో, ఒక కులం పై జరుగుతున్న వివక్ష పై నేను మాట్లడితే, దానికి అనేక అర్ధాలు తీసి ప్రచారం చేసారని అన్నారు. నేను ఎక్కడా, కమ్మవాళ్ళు పెట్టుకుంటే, లేచిపోతాడని అనలేదని అన్నారు. ఫ్యాక్షన్ అంటే తమ కుటుంబానికి మొదటి నుంచి దూరం అని అన్నారు. నిన్న రాత్రి నుంచి, నేను అనని మాటలు పట్టుకుని, ఫోనులు చేసి బెదిరిస్తూ బూతులు తిడుతున్నారని అన్నారు.