ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో, భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు, ప్రముఖ విద్యావేత్తల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో లిబరల్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.... దాతృత్వ కార్యకలాపాల్లో భాగంగా పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీకోసం తొలి విడుత రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ చైర్మన్‌, యూనివర్సిటీ సూపర్‌ వైజరీ బోర్డ్‌ చైర్మన్‌ ఆర్‌ శేషసాయి ఒక ప్రకటనలో వెల్లడించారు. .. క్రెయా యూనివర్సిటీ పేరుతో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు... ఈ యూనివర్సిటీలో మొదటి బ్యాచ్‌ 2019 జూలైలో ప్రారంభం అవుతుందని, ప్రవేశాలు నవంబరులో ప్రారంభం అవుతాయన్నారు. హాస్టల్‌తో కలిపి ఫీజు 7-8 లక్షల రూపాయలుంటుందని చెప్పారు.

rbi 24032018 2

తొలుత శ్రీసిటీలోని ఐఎ్‌ఫఎంఆర్‌ క్యాంపస్‌ నుంచి కోర్సుల నిర్వహణ జరుగుతుందని, తర్వాతి కాలంలో యూనివర్సిటీకి మారిపోతుందన్నారు. శ్రీసిటీలో 200 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపస్ 2020 నాటికి సిద్ధంకానున్నది. లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో నాలుగేళ్ల రెసిడెన్షియల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌ చేస్తామని, బిఎ (హానర్స్‌), బిఎ్‌సఇ (హానర్స్‌)కు ఇవి సమానమని తెలిపారు. వీటికి యుజిసి నుంచి అనుమతులు కోరినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

rbi 24032018 3

విశ్వవిద్యాలయ పాలక మండలి సలహాదారు రఘురాం రాజన్‌ మాట్లాడుతూ... ప్రపంచ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే భారతీయ విద్యార్థుల తరాన్ని తయారు చేసేందుకు తమవంతు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం మనదగ్గర లేని విధానాన్ని అందుబాటులోకి తేదలిచామనీ, ఇది తప్పకుండా మంచి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్నారు. భారతీయ, అంతర్జాతీయ స్థాయి మేధస్సును మేళవించే వేదికగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని పాలకమండలి మరో సభ్యుడు, ఎస్‌జేడబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన సజ్జన్‌ జిందాల్‌ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read