ఆంధ్రప్రదేశ్ లో అప్పులు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చ అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇక దివాళా అంచున ఉందని, ఇప్పటికే అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అంటే, అప్పులు తీర్చటానికి, మళ్ళీ అప్పులు చేస్తున్న పరిస్థితి చూసి, ఆశ్చర్య పోతున్నారు. నిన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ వేలం వేసి, రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు. అయితే అవి ఆంధ్రప్రదేశ్ అకౌంట్ లోకి రాక ముందు, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, అక్కడే మినాయించుకుంది. ఓవర్ డ్రాఫ్ట్ 2500 కోట్లు ఉందని, అందుకే ఇప్పుడు తీసుకున్న రెండు వేల అప్పుని, దానికి జమ వేసుకున్నాం అని చెప్పారు. ఇంత చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా రాకపోగా, ఇంకా 500 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ విధంగా అప్పు తీర్చటానికి, మళ్ళీ అప్పు చేస్తున్నారు. ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ వద్ద, సెక్యూరిటీ వేలంలో, 40 వేల కోట్ల అప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. పైగా, జనవరి నుంచి మార్చ్ వరకు, తమకు మరో 27 వేల కోట్లు అప్పు కావాలని జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్లి మరీ మోడీని కోరినట్టు తెలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

rbi 09022022 2

ముఖ్యంగా గత నెలలో, ఢిల్లీ వెళ్ళిన సమయంలో, ప్రధాని మోడీతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఈ నేపధ్యంలో, చివరి క్వార్టర్ లో తమకు 27 వేల కోట్ల అప్పు కావాలని కోరారు. ప్రత్యేక అనుమతి ఇవ్వాలని, నిబంధనలు ఉంటే సడలించాలని కోరారు. ఈ నేపధ్యంలోనే ఉన్నతాధికారుల సమావేశం జరిగినప్పటికీ , ఆర్ధిక శాఖ మాత్రం కొర్రీ వేసింది. ఇప్పటికీ FRBM పరిమితి దాటి, ఆంధ్రప్రదేశ్ అప్పులు తెచ్చుకుందని, ఇప్పుడు మళ్ళీ తిరిగి కొత్త అప్పులు ఇవ్వటం నిబంధనలకు వ్యతిరేకం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ కు ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇస్తే, మిగతా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఎక్కువ అప్పు అడిగితే, ఏమి చేస్తారని ఆర్ధిక శాఖ ప్రశ్నించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు 4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేషన్ పెట్టి, మద్యం అప్పు చూపించి, ఇలా రకరకాలుగా అప్పులు తెచ్చి, ఇప్పుడు మళ్ళీ వివిధ మార్గాల్లో అప్పుల కోసం చూస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read