ముందుగా మనకు తెలిసిన ఒక విషయం చెప్పుకుందాం. మనం ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఆ అప్పు ఊరికే ఇవ్వరు, నీకు ఉండే ఆదాయం ఏమిటో చూస్తారు, ఆ ఆదాయం సరిగ్గా లేదు అనుకుంటే, ఆస్తులు తనఖా పెట్టమంటారు, ఇంకా ఎక్కడైనా కక్కుర్తి పడే వాళ్ళు ఉంటే, ఎక్కవ వడ్డీకి అప్పు ఇస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పు తిరిగి కాట్టటం లేదు అనుకోండి అని ఏమి చేస్తారు ? మనకు బ్యాంకులో మన జీతం కానీ, మరే ఇతర లావాదేవీలు పడినా, వెంటనే అవి అప్పు బాకీ కింద లాగేసుకుంటారు. అదీ కుదరకపోతే, చివరకు మనం తనఖా పెట్టిన ఆస్తులు లాగేసుకుంటారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. అయితే ఇంకా తనఖా వరకు రాలేదు కానీ, బ్యాంకులో డబ్బులు లాగేసుకునే దాకా వచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే తొమ్మిదో తారీఖు వచ్చినా, ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదు. అంతే కాదు, పెన్షనర్లకు కూడా ఇంకా పెన్షన్లు పడలేదు. ఇలా నెల రెండో వారం దాకా జీతాలు పడకపోవటం, ఈ మధ్య గత 20 ఏళ్ళలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. అయితే సాంకేతిక కారణాలు అని చెప్తున్నా, ఖజానాలో నిధులు లేక చెల్లింపులు చేయలేదని అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే, ఎలాగైనా అప్పు తెచ్చుకోవటం కోసం, ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మంత్రి బుగ్గన ఢిల్లీలో మకాం వేసి చివరకు ఆర్బిఐ దగ్గర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వడ్డీ కట్టి మరీ రెండు వేల కోట్లు తెచ్చారు.

rbi 09072021 2

చివరకు అస్సాం రాష్ట్రం కంటే, మనమే ఎక్కువ వడ్డీ కట్టాం అంటే, మన పరపతి ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఇక కేంద్రం నుంచి కూడా రెవిన్యూ లోటు భర్తీ కింద రూ.1470 కోట్లు వచ్చాయి. దీంతో ఇక జీతాలు, పెన్షన్లు చెల్లించవచ్చని ప్రభుత్వం భావించింది. సరిగ్గా ఇక్కడే ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లో కొన్ని నిధులు వాడుకుంది. అవి పరిమితి లోపే తిరిగి కట్టేయాలి. అవి తిరిగి కట్టక పోవటంతో, అప్పుగా తెచ్చుకున్న రెండు వేల కోట్లు, అలాగే రెవిన్యూ లోటు కింద కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లు మినాయించుకుంది. అయినా ఇంకా 800 కోట్లు ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. దీంతో అప్పు పుట్టిన ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళాలి అనుకున్నా, రూ.1400కోట్ల తీసుకుంటే నాలుగు రోజుల్లో, అంత కంటే ఎక్కువ తీసుకుంటే 14 రోజుల్లో తిరిగి చెల్లించాలి. ఇప్పటికే 800 కోట్లు బాకీ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తే, ఈ 14 రోజుల్లో అంత ఆదాయం రాకాపోతే, మళ్ళీ ఆర్బిఐ ఊరుకోదు. దీంతో ప్రభుత్వానికి ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితి. మరి జీతాలు, ఎలా ఇస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read