ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్ధికంగా ఎన్ని కష్టాలు పడుతుందో అందరికీ తెలిసిందే. ఈ నెల జీతాలకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు తెచ్చిన అప్పు డబ్బు అంతా ఏమై పోతుందో అర్ధం కావటం లేదు. అభివృద్ధి శూన్యం. మరో పక్క సంక్షేమం గురించి ఎంత గొప్పగా చెప్తున్నా, అది ఆరోకర సంక్షేమమే. అయితే ఈ పరిస్థితిలో ఈ నెల జీతాలు, పెన్షన్ల కోసం, ఆర్బిఐ వద్దకు అప్పు కోసం వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్బిఐ షాక్ ఇచ్చింది. నిన్న సెక్యూరిటీ, బండ్ల వేలం ద్వారా, ఒక రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకుందామని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను, ఆర్బిఐ తిరస్కరించింది. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అయితే కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుంటాం అని, అయితే ఈ లోపు రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోరినా, ఆర్బిఐ నుంచి సానుకూల స్పందన రాలేదు. అంతే కాకుండా, సెక్యూరిటీ, బాండ్ల వేలాన్ని కూడా రద్దు చేసింది. దీంతో మళ్ళీ ఈ నెల 15 వ తదీ వరకు, ఆర్బిఐ వద్ద బాండ్ల వేలం కుదరదు. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం ఖంగుతింది. ఎలాగైనా అప్పు సాధించి, ఖర్చులు చేసుకోవాలని అనుకున్న ప్రభుత్వానికి షాక్ తగిలింది.

debt 06042021 2

అయితే సాధారణంగా, అప్పు తెచ్చుకోవటానికి, కేంద్రం నుంచి రెండు సార్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మొదటి తొమ్మిది నెలలకు ఒకసారి, అలాగే తరువాత మూడు నెలలకు ఒకసారి, ఇలా రెండు సార్లు పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం, ఇంకా కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి రాలేదు. గత ఆర్ధిక ఏడాది ఎన్ని అప్పులు చేసారు, గ్యారంటీ ఇచ్చి ఎన్ని రుణాలు పొందారు, రెవిన్యూ ఖర్చు ఎంత చేసారు, క్యాపిటల్ వ్యయం ఎంత, ఇలా అనేక వాటి పై క్లారిటీ రావాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఈ సమాచారం కేంద్రానికి వెళ్ళక పోవటంతో, ఆర్బిఐ వద్ద అనుమతి లభించలేదని తెలుస్తుంది. ఈ సమాచారం అంతా కేంద్రానికి పంపితే కాని, అన్నీ చూసి కేంద్రం అనుమతి ఇచ్చే అవకాసం లేదు. అయితే ఈ పరిస్థితి పై విపక్షాలు, ఆర్ధిక నిపుణులు మండిపడుతున్నారు. సొంత మీడియాలో ఎదురు దాడి కాకుండా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read