ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు రిజర్వ్ బ్యాంక్. మన రాష్ట్రానికి అప్పులు ఇచ్చే విషయంలో, రిజర్వ్ బ్యాంక్ కృషి అంతా ఇంతా కాదు. మంగళవారం వస్తుంది అంటే చాలు, కొత్త అప్పుల కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు ఇస్తుంది. కొత్త అప్పు విషయంలో, రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. సకాలంలో అప్పు చెల్లించక పోవటం, వడ్డీలు కట్టక పోవటంతో, కొత్త అప్పు పై ఆంక్షలు విధిస్తుంది. మళ్ళీ కేంద్రం దగ్గరకు ఆర్ధిక మంత్రి, ఆర్ధిక శాఖ అధికారులు వెళ్లి, బ్రతిమిలాడు, మొత్తానికి మళ్ళీ కొత్త అప్పు తెస్తున్నారు. అయితే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి వచ్చి, ఆ వచ్చిన అప్పుని, తమకు కట్టాల్సిన అప్పులో, తమకు కట్టాల్సిన వడ్డీల్లో మినాయించుకుంటూ, రాష్ట్రానికి రూపాయి అందకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి వరుస షాకులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ అనే వార్తలు, ఈ మధ్య కాలంలో అనేకం మన మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా ఒక వార్త వైరల్ అయ్యింది. వెరైటీగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం షాక్ అవ్వటం కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో, రిజర్వ్ బ్యాంక్ షాక్ అయ్యింది.

rbi 05022022 2

అసలు విషయం ఏమిటి అంటే, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాకు, ప్రతి రాష్ట్రంలో తమ శాఖ బ్రాంచ్ ఉంటుంది. ఆయా రాష్ట్ర రాజధానుల్లో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, తమ శాఖని పెడతారు. గతంలో అమరావతి రాజధాని చేయటంతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని భూమి కేటాయించమని రిజర్వ్ బ్యాంక్ కోరింది. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఒకటి కాదు, మూడు రాజధులు అని తేల్చింది. దీంతో రిజర్వ్ బ్యాంక్, తమ శాఖను ఎక్కడా పెట్టకుండా ఆపేసింది. అసలు విషయం ఏమిటి అంటూ, ఒక పౌరుడు రిజర్వ్ బ్యాంకు కు ఆర్టిఐ దరఖాస్తు చేసారు. మీరు ఎందుకు రిజర్వ్ బ్యాంక్ శాఖను ఇక్కడ పెట్టటం లేదని అడిగారు. దానికి రిజర్వ్ బ్యాంక్ సమాధానం ఇస్తూ, అసలు మీ రాజధాని ఏది ? మీ రాజధాని ఏదో చెప్తే, దాని పైన ఒక నిర్ణయం తీసుకుని, తమ శాఖ ఏర్పాటు చేస్తాం అంటూ, లేఖ రాయటంతో, మనమే కాదు, మన రాజధాని ఏమిటో అర్ధం కాక రిజర్వ్ బ్యాంక్ కూడా ఎలా జుట్టు పీక్కుంటుందో అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read