రాష్ట్రమంత్రివర్గమంతా ఊకదంపుడుగా మీడియాముందుకొచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, జగన్‌మెప్పుకోసం అర్రులచాస్తున్నారని, చంద్రబాబు దగ్గర గతంలో పనిచేసిన శ్రీనివాస్‌ అనేవ్యక్తి ఇంటిలో ఐటీదాడుల్లో రూ.2వేలకోట్లు దొరికాయంటూ, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐటీశాఖ నిర్వహించిన సోదాల వివరాలపై పూర్తిస్థాయి నివేదిక (పంచనామా) వచ్చాక, దానిఆధారంగా ఎవరిపేర్లున్నాయో, ఎవరు ఎవరికి బినామీలో చర్చిద్దామని టీడీపీ చెబుతున్నా, నిస్సిగ్గుగా బురదజల్లడానికే రాష్ట్రమంత్రులు , వైసీపీనేతలు తాపత్రయపడుతున్నారన్నారు. పరిపాలన చేయడం చేతగాక, నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావడానికి వైసీపీనేతలు, మంత్రులు సిద్ధంగా ఉంటే, వేదికనువారే నిర్ణయించాలని ఆలపాి సూచించారు. వ్యవస్థలపై వారికి ఏమాత్రం నమ్మకమున్నా, వారు తక్షణమే సీబీడీటీ ప్రకటన, ఐటీసోదాలపై బహిరంగచర్చకు రావాలన్నారు. గతంలో ఊళ్లలో అచ్చోసిన ఆంబోతులని తిరుగుతుండేవని, రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్మూలించే కార్యక్రమాలు చేస్తున్న మంత్రులుకూడా అదేవిధంగా తయారయ్యారని ఆలపాటి మండిపడ్డారు.

చంద్రబాబుని అవినీతిపరుడిగా చిత్రీకరించడంకోసం, నాటి వై.ఎస్‌నుంచి నేటి జగన్‌ వరకు అందరూ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. పీపీఏలరద్దు, రివర్సటెండరింగ్‌, రాజధానిలో ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌ అని, గృహనిర్మా పథకాల్లో అవినీతి జరిగిందని, విషప్రచారంచేసి చివరకు ఏమీనిరూపించలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారన్నారు. 9నెలల్లో సాధించిందేమీ లేకపోవడంతో చివరకు ఆధారాల్లేని ఆరోపణలతో ప్రతిపక్షంపై పసలేని వాదనలు చేస్తున్నారని రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. పార్లమెంటుసాక్షిగా ప్రత్యేకహోదా ఇవ్వమని కేంద్రంచెబితే, హోదాకోసం జగన్‌ ఢిల్లీవెళ్లాడని చెప్పుకోవడం సిగ్గుమాలిన వైసీపీనేతలకే చెల్లిందన్నారు. కర్నూలుని న్యాయరాజధానిగా చేస్తామని చెబుతూ, కేంద్రానికిచ్చిన నివేదికలో మాత్రం హైకోర్టుబెంచ్‌ ఏర్పాటుచేయాలని కోరడం సీమ వాసుల్ని మోసగించడంకాదా అన్నారు.

మంత్రివర్గమంతా అలీబాబా 40దొంగలముఠా లా మారి, రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలకు పాల్పడుతోందన్నారు. విశాఖకేంద్రంగా ఉన్న ప్రాజెక్టుల్లో మంత్రులు 70శాతం, 80శాతం షేర్‌హోల్డర్లుగా ఎందుకు మారారో చెప్పాలన్నారు. శ్రీనివాస్‌ ఇంట్లోని ఐటీదాడులు, కిలారిరాజేశ్‌ ఇంట్లోని ఐటీదాడుల పంచనామాలతో వైసీపీనేతలు చర్చకొస్తే, ఎవరు అవినీతిపరులో తేలుస్తామన్నారు. క్విడ్‌ప్రోకో ద్వారా లక్షలకోట్లు పోగేసిన జగన్‌, తనకున్న ఆస్తులన్నీ ఎక్కడినుంచి చెప్పగలరా అని ఆలపాటి నిలదీశారు. 2004కు ముందు రూ.9లక్షల పన్నులుక్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రూ.365కోట్లు చెల్లించేస్థాయికి ఎలావచ్చాడన్నారు. జగన్‌ తన ఒంటినిండా అవినీతి మసిపూసుకొని, దాన్ని చంద్రబాబుకి పూయాలని చూస్తున్నాడ న్నారు. అవినీతి..అవినీతి అనడంతప్ప, దాన్ని నిరూపించడం వైసీపీకి చేతకాలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read