ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రోజు ఎంతో మంది కలుస్తూ ఉంటారు... ఆయా సందర్భాల్లో ఆయనకు ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటారు... అవన్నీ రొటీన్... ఈ రోజు మాత్రం, చంద్రబాబుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు... ఈ గిఫ్ట్ చూసి చంద్రబాబు కూడా ఏంటో ముచ్చటగా, సంతోష పడ్డారు... చాలా సంతోషంగా ఉంది అంటూ, ఆ జ్ఞాపికను చూసి మురిసిపోయారు... చిన్న నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు... అప్పటి కష్టాలు గుర్తు తెచ్చుకుని, అవన్నీ దాటుకుని, ఎలా ఈ స్థాయికి వచ్చింది నెమరు వేసుకున్నారు... ఇంతకీ ఆ జ్ఞాపిక ఏంటో తెలుసా ? ఎవరు ఇచ్చారో తెలుసా ?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ రోజు సచివాలయంలో, అపురూప మెమెంటో బహూకరించారు మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు... చంద్రబాబు తిరుపతిలో 1958లో టి.పి.పి.ఎం స్కూలు చదువుకున్నప్పటి ఛాయాచిత్రాలతో మెమెంటో తయారు చేసి ముఖ్యమంత్రికి బహూకరించిన మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు కిశోర్ శ్రీరామ్ భట్ల, శేషాచలపతి వేల్పుల బి. చంద్రశేఖర్, గిరిధర్ ఆలూరి, బి. రాజశేఖర్.. చంద్రబాబు ఉపాధ్యాయుడు కేవీ నరసింహం పొటోలతో జ్ఞాపిక ఉంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. శ్రీరామ్‌ను అభినందించారు...
అంతే కాదు, ఈ 50 ఏళ్ల క్రితం జ్ఙాపకంలో చంద్రబాబుకు ఇచ్చిన కండక్ట్ కూడా రాసి ఉంది... A well behavied above average boy with winning manners, ready to take responsibilities, acted as class leader for one year, అని ఉంది... అంటే, మన సియం, ఎలాంటి వాడు అవుతాడో, 50 ఏళ్ల క్రితం మాష్టారులు అప్పుడే చెప్పేశారు...
ఇది చంద్రబాబు క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం... ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టే, చంద్రబాబు ఇప్పుడు ఇంతటి వాడు అయ్యారు... రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ, దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు... కేవలం కష్టపడే తత్త్వం, చదువు పై ఆయనకు ఉన్న మక్కువ, క్రమశిక్షణతో ఇక్కడి దాకా వచ్చారు.. ఇది అప్పటి చంద్రబాబు గురువులే చెప్పిన మాట....