అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండో రోజు మన దేశంలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోని, రాష్ట్రపతి భవన్ లో, కొంత మంది ముఖ్యమంత్రులతో కలిసి, సాయంత్రం రాష్ట్రపతి భావన్ లో విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు, దక్షిణభారత దేశంలో కేరళా, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు, ఈ విందుకు వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్ కు ఆహ్వానం అందలేదు. దీని పై అనేక వాదనలు నడుస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా, మన రాష్ట్రంలో పర్యటిస్తే, ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ పిలిచి మన ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదో అర్ధం కాలేదు. అయితే దీని పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు.

trump 25022020 2

ప్రశాంత వాతావరణానికి మారుపేరైన కుప్పంలో దౌర్జన్యాలు, రౌడీయిజం చేయాలని చూస్తే సహించేది లేదని, తానే స్వయంగా కుప్పంలో వచ్చి కూర్చుంటానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుప్పంలో వైకాపా నాయకులు దౌర్జన్యాల ద్వారా రాజకీయాలు చేయవచ్చునని అనుకుంటే అవి ఏమాత్రం పని చేయవన్నారు. కుప్పం పట్టణాన్ని అత్యంత సుందరీకరణతోపాటు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో రూర్బన్ పథకాన్ని తీసుకొస్తే వైకాపా నాయకులు కుప్పంను మున్సిపాలిటీ చేసి, ఆ నిధులను వెనక్కి పంపించారన్నారు. మున్సిపాలిటీ ద్వారా కుప్పంను అభివృద్ధి చేసుకోలేమన్నారు. కేవలం మున్సిపాలిటీ నిధులతోనే అభివృద్ధి చేసుకోవాలని, అదే పంచాయతీగా ఉంటే నరేగా నిధులు, ఇతర నిధులను పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేసుకోవచ్చుననే ఆలోచనను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

trump 25022020 3

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకాన్ని అయినా ఏ పార్టీ కార్యక్రమం అయినా కుప్పం నుండే ప్రారంభించి దిగ్విజయంగా అమలు చేశానని, ఇప్పుడు తమ ప్రభుత్వం లేకపోయినా సరే కుప్పంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాన్నారు. 35 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు రుణం తీర్చుకొనేందుకు అన్ని విధాలుగా పనిచేస్తానని తెలిపారు. కుప్పంకు కొందరు వలస పక్షులు వచ్చారని, మీ పనులు మీరు చూసుకొని వెళ్లాలే గానీ ఇక్కడి వాతారవణాన్ని కలుషితం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఆస్తుల విషయాల్లో విచారణలు చేయడం, భయాంబ్రాంతులకు గురి చేయాలనుకుంటే ఎవరూ భయపడేది లేదన్నారు. రాయలసీమకు సాగునీటి కోసం 64వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి, అగ్రికల్చర్, హర్టికల్చర్‌ను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read