రాజధాని అమరావతి పరిరక్షణ కోసం గత 45 రోజులుగా జరుగుతున్న ఆందోళన శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. అధికార వైసీపీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వచ్చి రైతులతో సంప్రదింపులు జరుపుతుందని ఆయన వెల్లడించారు. రైతులందరూ ప్రభుత్వ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు. మండంలో దీక్షా శిబిరం వద్దకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ వెళ్లారు. మందడంలో పలువురు రైతులు శుక్రవారం నుంచి 24 గంటల పాటు నిరాహార దీక్షకు ఉపక్రమించారు. ఆ దీక్షా శిబిరానికి వెళ్లిన శ్రీకృష్ణదేవరాయలు అక్కడే కొద్దిసేపు కూర్చుని, రైతులతో మాట్లాడారు. పలువురు మహిళా రైతులు సైతం తమ వాదన వినిపించారు. అనంతరం మైకు తీసుకొని రైతులనుద్దేశించి ప్రసంగం ప్రారంభించగానే, రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. రైతుల నినాదాల హోరులోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన ప్రసంగాన్ని ముక్తసరిగా ముగించారు.
రైతుల కష్టాలు తమకు తెలుసనీ, భూములు ఇచ్చిన రైతులేవరికీ అన్యాయం జరగదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ కమిటీ వచ్చినప్పుడు రైతులందరూ తమ అభిప్రాయాలు చెప్పాలని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే రైతులు ముందుగా అమరావతికి అనుకూలమా? కాదా ? చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని కొనసాగిస్తూనే తమతో చర్చకు రావాలని రైతులు శ్రీకృష్ణదేవరాయలుతో స్పష్టం చేశారు. అయితే ఇది ఇలా ఉంటే, వైసీపీ ఎంపీ నిన్న వెళ్ళటం పై, పలు సందేహాలకు తావు ఇస్తుంది. మొన్నటి దాక అమరావతి రైతులను, పైడ్ ఆర్టిస్ట్ లు, అమరావతి ప్రాంతం ఒక ఎడారి, అమరావతి ప్రాంతం ఒక స్మశానం అంటూ హేళన చేసిన వైసీపీ, ఇప్పుడు అదే రైతుల దగ్గరకు, తమ ఎంపీని పంపించటం పై, పలు సందేహాలు వస్తున్నాయి.
దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఎంపీని రాయబారానికి పంపారా ? లేక రైతుల్లో చీలక తేవటానికి పంపారా అనే సందేహాలు వస్తున్నాయి. ప్రభుత్వం తరుపున, రైతులతో సయోధ్య కోసం, ఎంపీ వచ్చినట్టుగా, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గురువారం, జగన్ మోహన్ రెడ్డిని, జాస్తి చలమేశ్వర్ తో కలిసి, ఆ మరుసటి రోజే అమరావతి రైతుల దగ్గరకు వచ్చారంటేనే, జరుగుతున్న విషయం ఏమిటో అర్ధమవుతుందని రైతులు అంటున్నారు. తాము ఏ చర్చలు అయినా, ఏ కమిటీ అయినా, అమరావతి పూర్తీ స్థాయి రాజధానిగా కొనసాగుతుంది అని చెప్తేనే, వారితో చర్చిస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ ఎంపీ ఇక్కడకు రావటం వెనుక మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వం తరుపున చర్చలకు రైతులని సిద్ధం చెయ్యటం, రెండు రైతుల్లో చీలక తేవటం, మూడు పార్లమెంట్ లో ఈ అంశం పై టిడిపి లేవనెత్తితే, మేము వెళ్లి వారి సమస్యలు విన్నాం అని చెప్పటం కోసం. మరి ఈ మూడిట్లో దేని కోసం, వైసీపీ ఎంపీ వచ్చారో, కాలమే చెప్తుంది.