నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎవరి నోట విన్నా, కరెంటు కోతలే. మాకు కరెంటు లేదు అంటే, మాకు కరెంటు లేదు అంటూ, అందరూ మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కుప్పలు తిప్పలుగా పోస్టింగ్ లు పడ్డాయి. కొన్న చోట్ల కేబుల్ ప్రసారాలు కూడా ఆగిపోవటంతో, ఇది ప్రభుత్వం చర్యలుగా భావించారు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ప్రజలకు చేరకుండా చేయటానికి, ఇలా చేసారేమో అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకున్నారు. అయితే అసలు విషయం ఈ రోజు పేపర్ లు చూస్తే అర్ధం అయ్యింది. నిన్న కరెంటు కోతలకు రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి, పవర్ కార్పొరేషన్ కు డబ్బులు కట్టక పోవటం, రెండోది సాంకేతిక లోపం తలెత్టటం. సహజంగా చలి కాలం, విద్యుత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి. అసలు విద్యుత్ కొరత ఉండదు. అయితే మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కాబట్టి, ఇబ్బందులు వస్తే చేతులు ఎత్తేయటమే గతిగా మారింది. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ కు, రాష్ట్ర ప్రభుత్వం బకాయలు చెల్లించకపోవటంతో, మన రాష్ట్రానికి విద్యుత్ ఆపేశారు. గురువారం, రెండు వేల మెగావాట్లు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ కారణంగానే నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి.

power 0402022 2

గతంలోనే నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ రాష్ట్రాన్ని హెచ్చించింది. జనవరి 21 లోపు బకాయలు తీర్చాలని లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖలను పట్టించుకోలేదు. దీంతో నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ రంగంలోకి దిగి, రాష్ట్రానికి కరెంటు ఆపేసింది. అంతే కాదు, అప్పటికప్పుడు పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు కూడా చేయకుండా, క్రమశిక్షణ చర్యలు కింద, శిక్ష విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర ఉన్న పవర్ ప్లాంట్లలో ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. అయితే విజయవాడ, కృష్ణ పట్నం యూనిట్లు సహకరించ లేదు. సాంకేతిక సమస్యలు వచ్చాయి. అయితే బొగ్గు కొరత కూడా ఉందని అంటున్నారు. ఈ కారణంతోనే నిన్న విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి. ఇష్టం వచ్చినట్టు చేయటం, మన సొంత ప్లాంట్లు ఉపయోగించకుండా, బయట నుంచి కరెంటు కొనటం, అక్కడ ఇబ్బందులు వస్తే, మన ప్లాంట్లు సహకరించకపోవటం, మొత్తంగా విద్యుత్ రంగం అస్తవ్యస్తం కావటంతో, ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read