మొన్నా మధ్య పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించి, ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ దొరికన ముఠాను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే... అయితే అప్పట్లో, జగన్ పార్టీ, సాక్షి మాత్రం, ఇది అంతా చంద్రబాబు చేపిస్తున్నారని, చంద్రబాబు ఎర్ర చందనం డాన్ అని, హెరిటేజ్ పెట్టిందే స్మగ్లింగ్ చెయ్యటానికి అని ప్రచారం చేశారు... రంగంలోకి దిగిన పోలీసులు, అప్పుడే నిందితులని పట్టుకున్నారు... అందరూ అనుకునట్టే, 2004 నుంచి ఎర్ర చందనం అక్రమంగా స్మగ్గ్లింగ్ చేస్తున్న ముఠానే దీని వెనకాలా ఉంది అని పోలీసులు తేల్చారు. అంతే కాదు, నిందుతుదిని అరెస్ట్ కూడా చేసి పూర్తి వివరాలు రాబట్టారు...

heritage 27112017 2

అప్పుడే ప్రిలిమ్నరీ ఎంక్వైరీ విషయాలు మాత్రమే చెప్పిన పోలీసులు, నిన్న పూర్తి స్థాయి విచారణ జరిపి, పూర్తి వివరాలు చెప్పారు... సాక్షాత్తు టాస్క్ ఫోర్సు ఎస్.పి రవిశంకర్ పూర్తి వివరాలు చెప్పారు... పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టికర్ వేసి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు స్మగ్లర్లను చిత్తూరు రెడ్ శ్యాండిల్ ట్రాక్స్ ఫోర్స్ కార్యదళం అరెస్ట్ చేసింది. వారిచ్చిన సమాచారంతో, ప్రధాన నిందితుడు రాజాశేఖర్ అలియస్ చిన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే ఈ చిన్నా చెప్పిన వివరాలు ప్రకారం, మరో నిందుతుడు మురుగేసన్ ని కూడా పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు... ఈ చిన్నా వైసీపీ కార్యకర్త, జగన్ వీరాభిమాని.. గత ఎన్నికల్లో కడప పోలింగ్ బుత్ లో దౌర్జన్యం చేసి, రిగ్గింగ్ చేస్తుంటే, అప్పుడు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు కూడా జరిపారు పోలీసులు...

heritage 27112017 2

ఈ చిన్నా, మురుగేసన్ ఇద్దరూ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారు... చంద్రబాబు వచ్చిన తరువాత వీరి ఆటలు సాగాకపోవటంతో, పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించి స్మగ్లింగ్ చెయ్యవచ్చు అని ప్లాన్ వేశారు... ఇక్కడ దొంగతనం చెయ్యటం ఒక ఎత్తు అయితే, ఒక వేళ పట్టుబడినా, అది హెరిటేజ్ కాతాలో తోసేసి, జగన్ కు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరచ్చు అనే సైకో ఆలోచన అలోచించి ఇలా ప్లాన్ చేశారు... ఈ విషయాన్ని విచారణలో మురుగేసన్కూడా ఒప్పుకున్నాడు... ఇప్పుడు పోలీసులు రాజకీయ కోణంలో కూడా విచారణ చేసే అవకాసం ఉంది.. దీనిలో రాజకీయంగా దెబ్బ తియ్యటానికి, ఎవరన్నా వీళ్ళ చేత ఇలా చేపిస్తున్నారా అనేది కూడా పోలీసులు విచారించే అవకాసం ఉంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read