అమరావతి రైతుల మహా పాదయత్ర ఈ రోజు ప్రారంభం అయ్యింది. న్యాయస్థానం నుంచ దేవస్థానం అంటూ, అమరావతిలోని హైకోర్టు దగ్గర నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకు, అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్లనున్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఈ రోజు అమరావతి వచ్చారు. అయితే ఆమె ఇబ్రహింపట్నం నుంచి అమరావతి వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేణుకా చౌదరికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో పాటుగా, ప్రజలు కూడా వచ్చారు. రోడ్డు పైన ఆమెకు కోసం హారతి ఇవ్వటానికి, స్వాగతం పలకటానికి సిద్ధం అయ్యారు. అయితే రోడ్డు పైన ఉన్న మహిళా కార్యకర్తలకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. రోడ్డు పైన ఉండటానికి వీలు లేదని అన్నారు. అక్కడ నుంచి కార్యకర్తలను చెదరగొట్టారు. రోడ్డు పైకే వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయితే విజయవాడ చేరకున్న రేణుకా చౌదరికి, జరిగిన ఘటన పై, మహిళలు ఫిర్యాదు చేయగా, ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు బొట్టు పెట్టటానికి వచ్చినా వాళ్ళని తరిమేసరని, వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు. హారతి ఇస్తాం అని, బొట్టు పెడతాం అని చెప్పినా, తరిమేసారు అని అన్నారు.
అమరావతిలో మహిళలను ఇలాగే చేసారని, ఇప్పుడు తనకు స్వాగతం పలకటానికి వస్తే కూడా అడ్డుకంటున్నారని, బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని, ఇది ఏపి పోలీసులకు సర్వ సాధారణం అయిపోయిందని అని అన్నారు. మీరు భయ పెడితే, మేము భయపడం అని అన్నారు. బొట్టు పెడతాం అంటే, సంస్కృతీ, సాంప్రదాయాలు కూడా పక్కన పడేసారని అన్నారు. ఒకటి గుర్తుంచుకోవాలని, అమరావతిలో ఉద్యమం చేస్తున్నది ఆడవాళ్ళే అని, నా తోటి మహిళలకు శభాష్ అంటూ, మమ్మల్ని మీరు అవమానపరుస్తారా ? భయపెట్టి మమ్మల్ని పంపించినంత మాత్రాన, మీరు మొనగాళ్ళు కాదని అన్నారు. చేతికి వేసుకుని మేము గాజలు కాదని, ఇవి విష్ణు చక్రాలు అని, రేపు ఓటు మిషన్ పై నొక్కేది ఇవే చేతులు అని అన్నారు. తనకు దేశంలో ఎక్కడైనా పర్యటించే అవకాసం ఉందని, కొంత మంది తాను ఎందుకు వచ్చానని అంటున్నారని వీళ్ళు అంతా నా సోదర సోదరీమణులు అని, ఎక్కడైనా తాను వెళ్ళే హక్కు ఉందని, తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.