సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) కూడా సమాన హక్కులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ కు సారధ్యం వహించిన జస్టిస్ కె.ఎల్. మంజునాద్ ఆయిదారు రోజుల్లో తన నివేదికను విడిగా ఇవ్వనున్నారు. అగ్రవర్గాలన్నింటిలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్న వారికి ఎనిమిది శాతం రిజర్వేషను ఇవ్వాలని సిఫార్సు చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో చంద్రబాబు ఆలోచన కూడా అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలని ఉండటంతో, ఈ సిఫార్సు ప్రభుత్వం ఆమోదించనుంది...

reservation 02122017 2

ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి. కాపుల రిజర్వేషన్ అంశం కూడా ఇవాళ అసెంబ్లీలో ఆమోదం పొందనుంది. అలాగే, బ్రాహ్మణులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు, ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని, కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాపులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి రుణాలు మంజూరు చేస్తున్నారు.

reservation 02122017 3

విదేశీ విద్యా పధకం ద్వారా అనేక మందిని విదేశాలకు పంపిస్తున్నారు. మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహాలోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలను కూడా ఆదుకోవాలని, అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఈబీసీ కార్పొరేషన్ కూడా పరిశీలనలో ఉంది... అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకొనేందుకు సాయం అందిచటం, వీరికి కూడా బ్యాంకుల ద్వారా విద్యా , వ్యాపారాభివృద్ధికి రుణాలు , అగ్రవర్ణ పేద విద్యార్ధులకు ఫీజు రీఎంబెర్సుమెంట్, చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాలు లాంటివి ఈ కార్పొరేషన్ చెయ్యనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read