అనుకున్నదే అయ్యింది. ఇన్నాళ్ళు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నట్టే, పెన్షన్ లో భారీ కోత పడింది. అయితే దీనికి తోడుగా, ఇంకా కొత్త పీఆర్సీ ప్రకారం పెన్షన్ వేయక పోవటంతో, భారీగా కోత పడింది. పోయిన నెలతో పోల్చుకుంటే, వారి వారి పెన్షన్ స్థాయిని బట్టి, దాదాపుగా రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు బొక్క పడింది. కొంత మందికి పెన్షన్ పడటం, అలాగే తమకు జెనరేట్ అయిన పెన్షన్ అమౌంట్ సిఎంఎఫ్ఎస్ లో చూసిన రిటైర్డ్ ఉద్యోగులు షాక్ తిన్నారు. అయితే ఏదో వెయ్యి రూపాయల వరకు తగ్గుతుంది అనుకుంటే, ఏకంగా పది, 15 వేలు తగ్గటం చూసి షాక్ తిన్నారు. అసలు విషయం ఏమిటి అని ఆరా తీస్తే, కొత్త పీఆర్సి ప్రకారం వేయలేదని, అలాగే ఇప్పటి వరకు నడుస్తున్న ఐఆర్ కూడా ఇవ్వలేదు. దీంతో భారీ బొక్క పడింది. ఇవన్నీ తరువాత అరెయర్స్ రూపంలో ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనే ఆధారం. వృద్ధ వయసులో, నెల వారి ఖర్చులకు ఇదే వారికి ఆధారం. అలాంటిది ఏకంగా పది వేలు, 15 వేలు తగ్గించి ఇవ్వటంతో, రిటైర్డ్ ఉద్యోగులు లబో దిబో అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేని అంటున్నారు.
ఈ నెల పడిన పెన్షన్ చూసి, షాక్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు... కొంత మందికి రూ.15 వేల వరకు తగ్గుదల...
Advertisements