ఏపీ ఎన్నికల్లో తెలివైన నిర్ణయం తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆ రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఒక అప్పీల్‌ చేయబోతున్నారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గందరగోళపడుతున్నారని విమర్శించారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. రాజకీయాల నుంచి చంద్రబాబుకు వీడ్కోలు పలికేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం గా తెలుస్తోందన్నారు. బుధవారం ఇక్కడ పీటీఐతో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్న తమ పార్టీ టీఆర్‌ఎస్ కు ఏపీలో అడుగుపెట్టాలన్న ఆలోచనలేమీ లేవని చెప్పారు.

thota 29102018 1

టీడీపీ, కేసీఆర్‌ మధ్య పోరుగా ఏపీ ఎన్నికలను చిత్రీకరించాలని బాబు ప్రయత్నించడం చాలా విచిత్రంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ కు ఏపీలో ఒక్క చోట కూడా పార్టీ కార్యాలయం లేదని, ఎన్నికల్లో కూడా అక్కడ తాము పోటీ చేయడం లేదని చెప్పారు. అక్కడ ఎవరో ఒకరి అవకాశాలను తాము ప్రభావితం చేస్తామనడం వాస్తవాన్ని వక్రీకరించడమేన్నారు. ‘‘ఏపీ ఎన్నికలలో ఎటువంటి ఫలితం రాబోతోందో సుస్పష్టం. చంద్రబాబు గద్దె దిగి బయటకు వెళ్లిపోయే దారిలో ఉన్నా రు. ఆయన రాజకీయ జీవితం ముగింపునకు చేరిం ది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆయనకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారు’’ అని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకునేలా చూడాలనుకుంటున్నాం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్ర యోజనాల కోసం ఒక అభ్యర్థన చేయాలని భావిస్తు న్నాం. అది ఎప్పుడు చేయాలనేది మా ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు’’ అని తెలిపారు.

thota 29102018 1

రానున్న లోక్‌సభ, మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడం, టీఆర్‌ఎస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కూటమిని టీఆర్‌ఎస్‌ ఓడించి ఘన విజయం సాధించింది. దరిమిలా చంద్రబాబుకు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఇస్తానని కేసీఆర్‌ సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ రెండుసార్లు ఏపీకి వెళ్లి చంద్రబాబుపై విమర్శలు చేశారు. కేసీఆర్‌, ఆయన పార్టీ, ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కుమ్మక్కయారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యం లో కేసీఆర్‌ ఏంమాట్లాడతారోనని ఆసక్తిగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read