రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా ఇద్దరూ సహకారం అందించుకున్నారు. చంద్రబాబుని ఎలా అయినా ఓడించటానికి, జగన్ తో కలిసి, కేసీఆర్ అనేక వ్యూహాలు పన్ని, చివరకు సక్సెస్ అయ్యారు కూడా. అయితే అది చంద్రబాబు కంటే, ఏపికే ఎక్కువ నష్టం చేసింది అనే వారు కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యులలో ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఎక్కువగానే ఉంది. తెలంగాణాలో కొన్ని ప్రాజెక్ట్ లు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ నేతలు కూడా కాంట్రాక్టులు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కూడా. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణా ముఖ్యులకు కావలసిన వారికి కాంట్రాక్టులు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సహజంగా వ్యాపారం అన్న తరువాత, రూల్స్ ప్రకారం, ఎవరో ఒకరికి కాంట్రాక్టు ఇవ్వాల్సిందే. అది ఎలా ఇచ్చారు, అనేది పక్కన పెడితే, చివరకు ఆ ప్రాజెక్ట్ మంచిగా ఉందా లేదా అనేది ప్రజలు చూస్తారు. అయితే సరిగ్గా ఇక్కడే కొన్ని రాజకీయ ఆరోపణలు తరుచూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఫెయిల్ అయిన సందర్భంలో, ఈ ఆరోపణలు మరింత ఎక్కువగా వస్తూ ఉంటాయి.

revanth 290802020 2

ఇక విషయానికి వస్తే తెలంగాణాలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పై, ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. ఫోటోలోతో సహా చూపించి, అప్పుడు, ఇప్పుడు అంటూ, వివరించారు. తెలంగాణాలో ఎంతో ప్రాధాన్యతతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ పై మొదటి నుంచి విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ నెలలో వచ్చిన వరద కారణంగా, రిజర్వాయర్ కు గండి పడి ఉళ్లు మునిగిపోవటంతో, ఈ ఆరోపణలకు బలం చేకూరింది. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత పై అనుమానాలు పెరిగాయి. ఇది ఇలా జరుగుతూ ఉండగానే, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్ళటానికి, ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన కూలిపోయిందని, అటు వైపు ఎవరినీ వెళ్ళకుండా పోలీసులని పెట్టారని రేవంత్ రెడ్డి కొన్ని ఫోటోలు, వీడియోలు వదిలారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఒక పేరు చెప్పని ఏపి మంత్రి పై ఆరోపణలు చేసారు. ఈ వంతెన కట్టింది ఒక ఏపి మంత్రికి చెందిన కంపెనీ అని, ఆ ఏపి మంత్రి నిర్వాకం బయట పడకుండా, కేసీఆర్ పోలీసులని పెట్టి, దాచే ప్రయత్నం చేస్తున్నారని, ఆరోపిస్తూ, కొన్ని ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ లో వదిలారు. అయితే, ఆ ఏపి మంత్రి ఎవరు ? తెలంగాణా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read