ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగులు, కంపనీల పై ఐటి దాడులు జరిగితే, మహా అయితే ఒక రోజు జరుగుతాయి.. మరీ పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంకొంచెం టైం తీసుకుంటాయి. అలాంటిది ఒక రాజకీయ నాయకుడు ఉండే ఒక డూప్లెక్ష్ ఇంట్లో సోదాలు చెయ్యటానికి 43 గంటలు పట్టింది. చివరకు ఒక ఈక ముక్క కూడా పట్టుకోలేక, ప్రెస్ ముందు రావటానికి సిగ్గేసి, అధికారులు వెళ్ళిపోయారు. అయినా ఘనత వహించిన హైదరాబాద్ మీడియా మాత్రం, సిగ్గు వదిలేసి, ప్రగతి భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చెప్తూ, ప్రజలని పిచ్చోల్లని చేసారు. చివరకు తేలింది ఏంటి అంటే, మీడియాలో చూపించిన డాక్యుమెంట్ లు అన్నీ ఫేక్ డాక్యుమెంట్ లు అని..

revanth 29092018

ఇదే విషయం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. తన పెళ్లి 1992, మే 7న జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ దాడుల సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నేతలు తన మామయ్య పద్మనాభరెడ్డితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారన్నారు. వారంతా తనకు బినామీగా ఉన్నట్లు చెప్పడం పై రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. సదరు నేతకు బినామీ ఆస్తులంటే అర్థమే తెలియదని వ్యాఖ్యానించారు. తనకు పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డి అప్పట్లోనే ఆల్ ఇండియా కిరోసిన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడని తెలిపారు. ఇక తన కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు, ఓ సోదరి ఉన్నారని రేవంత్ అన్నారు. ఇంతమంది ఇంట్లో ఉంటే మరొకరి పేరుపై బినామీ ఆస్తులను పెట్టాల్సిన అగత్యం ఏముందని ఆయన ప్రశ్నించారు.

revanth 29092018

బంజారాహిల్స్ లోని తన నాలుగు అంతస్తుల భవనం నుంచి అవినీతికి పాల్పడినట్లు కొందరు ఆరోపించడంపై రేవంత్ సీరియస్ గా స్పందించారు. తాను 18 షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించడంపై మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లోని ఇంటిని 22 ఏళ్లుగా కంపెనీలకు లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ చాలా కంపెనీలు ఆ బిల్డింగ్ ను లీజుకు తీసుకున్నాయని వెల్లడించారు. కంపెనీలు సాధారణంగా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అద్దెకున్న ఇంటి అడ్రస్ పైనే చేపడతాయనీ, వాటన్నింటిని తన నెత్తిపై రుద్దితే ఎలాగని రేవంత్ ప్రశ్నించారు. తాను 23 మంది డైరెక్టర్లను నియమించి బినామీ కంపెనీలను నడిపానని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

revanth 29092018

కేసీఆర్ రెచ్చగొట్టిన ఓ జంతువు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కేసీఆర్ ముసలి తనంతో, తిన లేక, పారేసే బొక్కలు ఏరుకునే సన్నాసులు తన పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి కనీసం నాలుగు నెలలైనా జైల్లో పెట్టాలని అనుకున్నారని,ఇలా ప్లాన్‌ చేసేది కేసీఆర్ అయితే, దాన్ని అమలు చేసేది మోదీ అని రేవంత్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలని మోడీ ఎలా ఇబ్బంది పెడుతున్నాడో, ఇక్కడ కెసిఆర్ చెప్పిన నా పై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ సదర్భంగా కెసిఆర్ కు ఛాలెంజ్ చేసారు రేవంత్. 2001నుండి ఈనాటి వరకూ, కేసీఆర్ గారి కుటుంబం ఆస్తులు అప్పులు ఎంత. ? 2007నుండి ఈనాటి వరకూ రేవంత్ రెడ్డి కుటుంబం ఆస్తులు అప్పులు ఎంత. ? హైకోర్టు సీట్టింగ్ జడ్జితో ( లేదా ) సుప్రీంకోర్టు సీట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుందాము సిద్ధమా.? 24గంటల్లో ఓ కేసీఆర్ గారు నీ జవాబు మాట ఏమిటో చెప్పండి అంటూ కెసిఆర్ కు సవాల్ విసిరారు.

revanth 29092018

ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో, సిగ్గు అనేది పూర్తిగా వదిలేసి, కెసిఆర్ చెప్పిన దానికి లొంగిపోయి, జర్నలిస్ట్ విలువులు లేని హైదరాబాద్ మీడియా పై, రేవంత్ నిప్పులు చెరిగారు. దూకుడు సినిమాలో బ్రహ్మానందంలాగా ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మన్స్ ఇచ్చి, కెసిఆర్ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బ్యాంక్ అకౌంట్లు,నంబర్ల వేసే అప్పుడు, నఖల్ కొట్టాలన్నా అఖల్ వాడాలి కదా అంటూ, డూప్లికేట్ చేయడానికైనా బుద్ధి వాడాలి కదా అని మీడియాని ప్రశ్నించారు. "నా మీద ఒక మీడియా అధిపతి ఎగుర్తున్నాడు....నాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఆయనకు చెప్తున్నా, నాకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని నిరూపించలేకపోతే నువ్ డిఎన్ఏ టెస్ట్ కి రెడీ కావాలి.....నీ పుటక సక్రమం అని , నీ అమ్మ కి నాయన కి నువ్ పుట్టావ్ అని" అంటూ ఒక మీడియా ఛానల్ అధిపతికి సవాల్ విసిరారు.

మలేసియా, హాంకాంగ్ లో అకౌంట్లు ఓపెన్ చేసి కోట్లాది రూపాయల వ్యవహారాలు నడిపినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక అసలు మలేసియా, హాంకాంగ్ లకు వెళ్లనేలేదనీ, అలాంటప్పుడు బ్యాంకు అకౌంట్లు తెరవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి అన్న రీతిన రిపోర్టర్లు తయారయ్యారని రేవంత్ విమర్శించారు. ఐటీ దాడుల్లో రూ.10-20 కోట్ల అక్రమాస్తులు దొరికినట్లు కొన్ని మీడియా సంస్థలు రాస్తే.. ఓ మీడియా సంస్థ మాత్రం రూ.1,000 కోట్లు దొరికినట్లు రాసిందని చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఒత్తిడితోనే రాస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తనపై చేసిన చిల్లర ఆరోపణలను చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కు లొంగిపోయి, తెలంగాణా సమాజాన్ని నాశనం చెయ్యకుండా, నిజాలు ప్రసారం చెయ్యాలని రేవంత్ అన్నారు. నన్ను అరెస్ట్ చేసి చంచల్ గూడ,చర్లపల్లి కాదు కదా, అండమాన్ జైళ్లలో చీకటి గదుల్లో మగ్గేలా చేసినా ఇలాగే నిటారుగా ఉంటా,కేసీఆర్ తాట తీస్తా, రేపటి నుంచి ప్రజల్లోకి వస్తున్నా కాచుకో అంటూ కెసిఆర్ కి సవాల్ విసిరారు రేవంత్.

Advertisements

Advertisements

Latest Articles

Most Read