కేసీఆర్ కు రేవంత్ ఫోబియా పట్టుకుంది.. సియం సీటు తరువాత, రేవంత్ ఉంటే తనకు ఎమ్మల్యే పదవి కూడా దక్కదని, రేవంత్ ను, తనకున్న అధికారాలతో ముప్పుతిప్పలు పెడుతున్నాడు కేసీఆర్. మొన్న సెక్యూరిటీ తగ్గించి, రేవంత్ ని చంపేస్తాం అంటూ లీక్‌లు ఇచ్చి, రేవంత్ ని కొడంగల్ నుంచి బయటకు రాకుండా చేసారు. ఈ రోజు ఏకంగా తలుపులు బద్దలగొట్టి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా, ఇష్టం వచ్చినట్టు ఇంట్లో విధ్వంసం సృష్టించి, రేవంత్ ను ఈడ్చుకెళ్ళారు. సీఎం కేసీఆర్ నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభను అడ్డుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఈసీకి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్ పోలీసు స్టేషన్లో రేవంత్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డీజీపీ జితేందర్ తెలిపారు. రేవంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని రేవంత్ భార్య ఆందోళన చెందుతుంది. ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చినట్లు రేవంత్ అనుచరులు తెలుపుతున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి పై రెండు కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. కాగా రేవంత్‌రెడ్డిని ఇతర నియోజకవర్గాల్లో తిరగకుండా అడ్డుకొనేందుకే అధికారపక్షం ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే బొమ్మరాస్‌పేటలో నేడు సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించిన విషయం తెలిసిందే.
అయితే రేవంత్ మాత్రం, "అల్లర్లకు దొర స్కెచ్ ఇది... పోలీసుల మొహరింపు మధ్య పోలింగుకు కుట్ర ఇది.. కార్యకర్తలారా... ఆవేశం వద్దు... అప్రమత్తంగా ఉండండి... ఆగ్రహావేశాలతో కేసీఆర్ ట్రాప్ లో పడవద్దు...సంయమనంగా వ్యవహరిద్దాం... ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ది చెబుదాం..." అంటూ అరెస్ట్ చేస్తున్న సమయంలో నినాదాలు చేస్తూ వెళ్లారు. మరో పక్క, పోలీసులు అరెస్ట్ చేసి ఎటు తీసుకుని పోతున్నారో చెప్పక పోవటంతో, రేవంత్ సిబ్బంది పోలీస్ వాహనాలని ఫాలో చేస్తుంటే, రేవంత్ కార్ ని గుద్ది పక్కకు తోసేసి, రేవంత్ కార్ తాళాలు తీసుకుని పోలీసులు వెళ్లిపోయారని, రేవంత్ సిబ్బంది చెప్తున్నారు. అర్దరాత్రి అరెస్ట్ లు , తన చానల్స్ లో దొంగ సర్వేలు, ఇలా అనేక విధాలుగా కేసీఆర్ తన ఓటమిని ముందే ఒప్పుకుంటున్నారు. ఇంత దారుణంగా, ఎప్పుడూ జరగలేదేమో, కనీసం ఇంట్లో ఆడవాళ్ళూ ఉన్నారని కూడా సోయ లేకుండా, తలుపులు విరగొట్టి, ఇలా చేయటంతో కేసీఆర్ సాధించేది ఏమి ఉండదు.