ఇది వరకు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఎలా చేసారు, ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఎలా వాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగిస్తున్నారు, ఆక్వా రంగం ఎలా దూసుకు వెళ్తుంది, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎలా ఆదర్శం, ఇలా అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ గురించి వివిధ రాష్ట్రాలు మన వైపు చూసేవి. సాక్షాత్తు భారత రాష్ట్రపతి, రియల్ టైం గవర్నెన్స్, అన్ని రాష్ట్రాలు అమలు చెయ్యాలి అని, రాష్ట్రాలకు చెప్పారు అంటే, అది ఏపి పరిస్థితి. కాని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జోక్ అయిపొయింది. 5 గురు డిప్యూటీ సియంలు పెట్టినప్పుడు, దేశమంతా ఇదేమిటి అంటూ నవ్వారు, తరువాత రంగులు చూసి నవ్వారు, తరువాత విద్యుత్ పీపీఏలతో, దేశం నష్ట పోతుందని అందరూ చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు చూసి నవ్వుకుంటున్నారు. అందరికంటే, ఎక్కువగా నవ్వుతుంది, మన పక్క రాష్ట్రం తెలంగాణా. ఏ తెలంగాణా సియం కేసీఆర్, మనల్ని థర్డ్ గ్రేడ్ రాష్ట్రం అన్నారో, ఆయన ముందే మనం నవ్వుల పాలు అవుతున్నాం.

amarvati 120120120 2

మన రాష్ట్రంలో గత ఏడు నెలలుగా ఉన్న పరిస్థితి చూసి, కొత్త పెట్టుబడులు రావటం లేదు. ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. ఇదే పక్క రాష్ట్రం అయిన, తెలంగాణాకు కలిసి వస్తుంది. కొన్ని రోజుల క్రితం, తెలంగాణా ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఒక రియల్టర్ సమ్మిట్ లో స్పందిచారు. దేశం అంతా, రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ లో ఉంటే, హైదరాబాద్ లో చాలా స్పీడ్ గా ఉంది అని, దీనికి పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా కారణం కదా అంటూ, నవ్వుతూ హరీష్ రావు చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అమరావతి పై మాట్లాడారు. అమరావతిలో పరిస్థితి తెలుసు అని, ఒక తెలంగాణా రాష్ట్ర పౌరుడిగా ఎంతో సంతోషిస్తున్నా అని, కాని ఒక దేశ పౌరుడిగా బాధ పడుతున్నా అని ఆన్నారు.

amarvati 120120120 3

తెలంగాణా పౌరుడిగా ఎందుకు సంతోషం అంటే, అక్కడ మొత్తం రాష్ట్రం కుప్ప కూలింది, దీంతో హైదరాబాద్ వైపు అందరూ చూస్తున్నారు, ఆదాయం పెరిగింది, అయితే ఒక దేశ పౌరిడిగా ఎందుకు బాధ అంటే, మన పక్క రాష్ట్రం, మొన్నటి వరకు కష్టపడుతూ ముందుకు వెళ్తున్న సమయంలో, ఇప్పుడు గందరగోళం వచ్చి, మొత్తం నాశనం అయ్యింది అనే బాధ అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తనకు ఇక్కడ ఎన్నికల్లో సహకరించిన, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం, జగన్ అక్కడ గందరగోళం సృష్టించారని, రేవంత్ అన్నారు. అయినా పక్క రాష్ట్రం గురించి ఇంతకంటే ఎక్కువ మనకు ఎందుకు, మనకే చాలా సమస్యలు ఉన్నాయి అంటూ రేవంత్ ముగించారు. మొత్తానికి, మన రాష్ట్రంలో పరిస్థితి, తెలంగాణాకు కలిసి వచ్చిందని, అక్కడ ప్రతిపక్షం, పాలక పక్షం కూడా అంగీకరించింది. ఇది మన రాష్ట్ర పరిస్థితి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read