పార్టీలు మారేప్పుడు అమ్మనా బూతులు తిట్టి బయటకు వెళ్ళే వారిని చూశాం... భవిషత్తునిచ్చిన తల్లి లాంటి పార్టీని, తండ్రి లాంటి నాయకుడిని అనరాని మాటలు అనే వాళ్ళని చూశాం... తనకు అండగా ఉన్న కార్యకర్తలని నిలువునా ముంచి వెళ్ళిపోయే వారిని చూశాం... కాని రేవంత్ రెడ్డి వీటన్నిటికీ అతీతం... అమరావతిలో ఇవాళ తెలంగాణా తెలుగుదేశం నాయకుల పంచాయితీ జరిగింది... రేవంత్ రాజీనామా లేఖ ఇచ్చి వెళ్ళిపోయారు... కాని ఆ రాజీనామా లేఖ అందరూ ఇచ్చినట్టు బూతులు తిడుతూ లేదు... చాలా ఎమోషనల్ టచ్ ఉంది...
ముందుగా ఎన్టీఆర్ స్పూర్తి గురించి రాసారు రేవంత్... తరువాత చంద్రబాబుని, పార్టీని, కార్యకర్తలని ఉద్దేశిస్తూ, ‘‘మీతో నా ప్రయాణం మరిచిపోలేనిది. మీ నాయకత్వంలో చేసిన పోరాటాలు గొప్ప అనుభవాన్నిచ్చాయి. మీ అనుచరుడిగా, టీడీపీ నేతగా గుర్తింపు పొందడం గర్వకారణం. తక్కువ సమయంలో పార్టీలో మంచి గుర్తింపు ఇచ్చారు. సీనియర్లు ఉన్నా నాకు కీలక అవకాశాలిచ్చారు. నా శక్తిమేరకు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించా. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. టీడీపీతో బంధం తెంచుకోవడం నాకు గుండె కోతతో సమానం’’
అంతే కాదు, నేను పార్టీ మారటానికి ప్రధాన కారణం, నా లక్ష్యం అయిన కెసిఆర్ ని దించటం కోసం అంటూ, కెసిఆర్ చేసిన, చేస్తున్న అరచాకలు, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాబిన్నమయ్యాయని, ఇలా అన్నీ లేఖలో రాశారు... ఎమ్మల్యే పదవికి కూడా రాజీనామా చేసున్నా అని చెప్పారు... ఇంతకంటే నైతికత ఏమి ఉంటుంది... చివరగా చంద్రబాబుని ఉద్దేశిస్తూ, "పార్టీ అధ్యక్షుడుగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్పూర్తి గుండెల నిండా నింపుకుని తెలంగాణ సమాజ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను."