రామ్ గోపాల్ వర్మ ఇయనొక సీరియస్ గా ఉండే కామెడి కారెక్టర్ అని చెప్పుకోవచ్చు.ఈ మధ్య ABN లో జరిగిన OPENHEART WITH RK కార్యక్రమంలో క్రియేటివ్ గా ఫీలయ్యే రాంగోపాల్ వర్మ సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. ఈ షో లో రాధాక్రిష్ణ అడిగిన ప్రశ్నలకు RGV సూటిగా సమాధానం చెప్పలేక పోయారు. మీరు వైసిపి ఎంపి రఘు రామ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేసి సెల్ లో కొట్టారు కదా ? అ కధనం పై సినిమా తియ్యొచ్చు కదా అని RK అడిగిన ప్రశ్నకు, ఒక సినిమా తీయడానికి కావలిసినంత డ్రామా ఇందులో లేదని చెప్పుకొచ్చారు. ఏముంది కొట్టారు అంతే కదా, దాంట్లో డ్రామా ఏముందని వర్మ అనగానే, దిశ రే-ప్ అంశం పైనే సినిమా తీసిన మీకు ఒక MP ని పిచ్చ కొట్టుడు కొట్టడం పై ఎటువంటి డ్రామా కనిపిచటం లేదా అంటూ వ్యగ్యంగా ఎదురు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా వర్మ మాట్లాడుతూ నేను ఒక 10 సబ్జక్టులు ఎంచుకుంటాను దానిలో నాకు డ్రామా ఎందులో ఎక్కువగా ఉంటె దానినే నేను సినిమా తీస్తానని ఆయన సమర్దించుకోచ్చారు. తనకు రఘు రామ విషయం లో అంత సబ్జెక్టు కనిపించలేదని ఏదో కవర్ చేసారు. దాంతో RK ఒక్క నవ్వు నవ్వి, మీకు MP ని పోలీసులు కొడితే డ్రామా కనిపించలేదు సరే, అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు.

viveka 17012022 2

బాత్రూంలో వివేక హ-త్య పైన చాలా డ్రామా ఉంది కదా, దాని మీద సినిమా తియ్యోచ్చు కదా అని ప్రశ్నించి వర్మ ని మరింత ఇరకాటంలో పడేసారు. దానికి సమాధానంగా, తనకు అందులో కూడా పెద్ద డ్రామా కనిపించ లేదని , అసలు అ హ-త్య విషయం పై తనకు సరైన అవగాహన లేదని, దీనిపై సినిమా తీయనని స్పష్టం చేసారు. అయిన RKవదలకుండా మరిన్ని ప్రశ్నలు అడిగి వర్మ ని అడ్డంగా బుక్ చేసారు. మరి ఏం డ్రామా ఉందని కొండా కుటుంబం పై మీరు సినిమా తీసున్నారని RK అడిగిన ప్రశ్నకు, కొండా కుటుంబానికి మా-వో-యి-స్ట్ చరిత్ర ఉందని, పైగా ప్రేమ కధ కూడా తోడవుతుందని , ఆయన సమర్ధించారు. వర్మ ఈ విషయాలపై ఎంత కవర్ చేసినప్పటికీ, RK మాత్రం వదలకుండా ప్రశ్నలు అడుగుతూనే వున్నారు, చివరగా ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అన్న NTRచంద్ర బాబుకు వ్యతిరేఖంగా సినిమా తీసిన మిమ్ముల్ని ,రఘు రామ, వివేక కేసు పై సినిమాలు తీయడానికి ధైర్యం చాలని పిరికి పంద వర్మ గా మేము అనుకోవచ్చా అని అడిగితే, నేను ఎవ్వరిని పట్టించుకోను, మీ ఇష్టం వచ్చినట్లు అనుకొండి అని తెలివిగా తప్పించుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read